LSG vs CSK: జడేజా, ధోనీ మెరుపులు వృథా.. కీలక పోరులో లక్నో సూపర్ విక్టరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2024: వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిన తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ మళ్లీ విజయాలను నమోదు చేస్తుంది. బౌలర్లకు అనుకూలంగా ఉంటూ బ్యాటర్లకు కొరకరాని కొయ్యగా మారిన లక్నో పిచ్‌పై లక్ష్య ఛేదనను విజయవంతంగా పూర్తి చేసింది. చెన్నై నిర్దేశించిన 177 రన్స్ టార్గె్ట్ ను మరో ఓవర్ మిగిలుండగానే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నిర్జీవమైన లక్నో పిచ్‌పై డికాక్ (43 బంతుల్లో 54, 5 ఫోర్లు, 1 సిక్స్), కేఎల్ రాహుల్ (53 బంతుల్లో 82, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) రికార్డు భాగస్వామ్యంతో ఆ జట్టు 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. తొలుత సీఎస్‌కేను లక్నో బౌలర్లు కట్టడి చేయడంతో ఆ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 రన్స్ చేసింది. రవీంద్ర జడేజా (40 బంతుల్లో 57 నాటౌట్, 5 ఫోర్లు, 1 సిక్సర్), రహానే (36) రాణించారు.
Read Also: Saturday Stotram: మీ సంకల్పం నెరవేరాలంటే ఈ స్తోత్ర పారాయణం చేయండి
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఇక, ఆరంభ మ్యాచ్‌లలో అదరగొట్టిన రచిన్ రవీంద్ర (0) మరోసారి నిరాశపరచగా కెప్టెన్ రుతురాజ్ (17) కూడా ఈ మ్యాచ్ లో విఫలమయ్యాడు. నాలుగో స్థానంలో వచ్చిన జడేజా.. ఓపెనర్ రహానే (36) తో కలిసి పరుగులు రాబట్టారు. ఈ జోడీని కృనాల్ పాండ్యా విడదీశాడు. ఆ తర్వాత ఈ సీజన్‌లో జోరు మీదున్న శివమ్ దూబే (3)ను స్టోయినిస్ పెవిలియన్‌కు పంపించేశాడు. రహానే స్థానంలో వచ్చిన రిజ్వి (1) ఏమాత్రం ప్రభావం చూపకుండానే డగౌట్ కు వెళ్లిపోవడంతో చెన్నై కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జడ్డూ.. మొయిన్ అలీ (30) సీఎస్‌కే రన్ రేట్ ను మళ్లీ పెంచారు. 18వ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టిన మొయిన్ అలీ.. ఆ మరుసటి బంతికే బదోని చేతికి చిక్కాడు. ఇక, 13 బంతులు మిగిలుండగా క్రీజులోకి వచ్చిన ధోనీ.. 4, 6, 6, 4, 4 తో మొత్తం 28 పరుగులు చేసి చెన్నైకి పోరాడే స్కోరును అందించాడు.
Read Also: Govinda Namalu: మనసులోని కోరికలు నెరవేరాలంటే.. గోవిందనామాలు వినండి
టార్గెట్ ను ఛేదించేందుకు వచ్చిన లక్నోకు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. పవర్ ప్లేలో ఈ జోడీ చెన్నై బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ముస్తాఫిజుర్ వేసిన 15వ ఓవర్లో క్వింటన్ డికాక్ ధోనీకి క్యాచ్ ఇవ్వడంతో 134 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి ముగింపు పలికాడు. ఈ పిచ్‌పై ఈ వికెట్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. రాహుల్, డికాక్ ఔట్ అయినా తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ (23 నాటౌట్), స్టోయినిస్ (8 నాటౌట్) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేసేశారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..