Pakistan: పాక్ పౌరులకు నేడే లాస్ట్ డే.. ఒక్క మహారాష్ట్రలోనే 5 వేల మంది పాకిస్థానీయులు..
- పహల్గాం ఉగ్రవాద దాడిపై భారత్ కఠిన చర్యలు
- పాక్ పౌరులకు నేడే లాస్ట్ డే
- మహారాష్ట్రలోనే 5 వేల మంది పాకిస్థానీయులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం భారత్ పాకిస్థాన్‌పై కఠినంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్న పౌక్ దేశస్థులు ఈనెల 27వ తేదీ(ఆదివారం) లోపు తిరిగి తమ దేశానికి వెళ్లిపోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక మెడికల్ వీసాల మీద వైద్యం కోసం వచ్చిన వారికి మాత్రం మరో రెండు రోజుల సమయం ఇచ్చారు. ఇలాంటి వారు ఈనెల 29వ తేదీ లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఇప్పటికే భారత్, పాక్ సరిహద్దుల్లో ఉన్న అట్టారీ బోర్డర్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం మూసివేసింది.
READ MORE: Rakul Preet Singh : దేవుడి దయవల్ల నాకు దాని అవసరం రాలేదు..
Also Read
కాగా.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ 5 వేల మంది పాకిస్థాన్ పౌరులు.. దేశం విడిచి వెళ్లాలని సూచించినట్లు మహారాష్ట్ర మంత్రి యోగేష్ కదమ్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో దీర్ఘకాలిక వీసాలపై దాదాపు 4 వేల మంది పాకిస్థానీయులు ఉండగా.. సార్క్ వీసా కింద మరో 1000 మంది ఉన్నారని తెలుస్తోంది. ఈ వెయ్యి మందిలో సినిమా ఇండస్ట్రీ, మెడికల్, జర్నలిజం, వ్యక్తిగత పనుల కోసం మహారాష్ట్రకు వచ్చిన వారు ఉన్నారట. వీరిలో కొందరు గత 8 నుంచి 10 ఏళ్లుగా మన దేశంలోనే ఉంటున్నారు.
READ MORE: Merugu Nagarjuna : ఏపీలో చదువులమ్మ తల్లిని చంద్రబాబు అటకెక్కిస్తున్నారు
కాగా.. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 250 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసులు లెక్క తేల్చారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 208 మంది, సైబరాబాద్ పరిధిలో 39 మంది, రాచకొండ పరిధిలో ముగ్గురు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఇందులో పర్యాటక వీసాలపై వచ్చిన వారి సంఖ్య స్వల్పమే. ఎక్కువ మంది దీర్ఘకాలిక వీసాలపై ఉంటున్నారు. మినహాయింపు ఉన్న వారు, దీర్ఘకాలిక వీసాలపై వచ్చిన వారు మినహా మిగతా వారంతా గడువులోగా పాకిస్థాన్ వెళ్లిపోవాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!