ఏ ప్రాజెక్ట్ అడిగినా గడ్కరీ అడ్డు చెప్పరని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరి వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. మహారాష్ట్ర రవాణా శాఖమంత్రిగా ఉన్నపుడు గడ్కరీ ముంబై, పూణే హైవే నిర్మాణం చేశారని గుర్తు చేశారు. 1997 సమయంలో గొప్ప ప్రాజెక్ట్ నిర్శించారని గుర్తు చేశారు. అభివృద్ధికి నాగరికతకు చిహ్నం రోడ్లు.. వాజ్పెయి రోడ్లను అభివృద్ధి చేస్తే మోడీ కొనసాగించారన్నారు. గడ్కరీ నాయకత్వంలో రోడ్ల అభివృద్ధి బలంగా జరుగుతోందని కొనియాడారు. గడ్కరీలో చిత్తశుద్ధి, అంకిత భావం ఉందన్నారు. సాగరమాల, భారత మాల ఇలా ఎన్నో ప్రాజెక్ట్ లు చేశారని చెప్పారు. నెల్లూరు నుంచి తిరుపతికి ఒకప్పుడు పది గంటలు పట్టేదని.. ఇప్పుడు తొందరగా వెళ్తున్నామన్నారు. మన రాష్ట్రంలో ఐదేళ్ళ పాటు రోడ్లు విధ్వంసం అయిపోయాయన్నారు.
ప్రస్తుతం రూ. 70 వేల కోట్లు విలువ చేసే రోడ్ పనులు మంజూరు అయ్యాయి.. ఆంధ్రప్రదేశ్‌లో భూ సేకరణకు సంబంధించి ఏ ప్రాజెక్ట్ అయినా ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఇవాళ రైతుల అక్కౌంట్లో అన్నదాత సుఖీభవ నిధులు జమ అయ్యాయని.. మళ్ళీ ఆగస్ట్ 15 న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి అందుబాటులో కి వస్తుందన్నారు. గడ్కరీ ఆంధ్రప్రదేశ్ ను హోమ్ స్టేట్‌గా భావించాలని కోరారు.
READ MORE: Pakistan: బొమ్మ అని భావించి “మోర్టార్ షెల్”తో ఆట, పేలుడుతో ఐదుగురు మృతి..
ఇవాళ తన జీవితంలో హ్యాపీయెస్ట్ డే అని సీఎం చంద్రబాబు అన్నారు. “ఉదయం రైతులకు డబ్బులు ఇచ్చాం. ఇప్పుడు ఆ నిధులు సంపాదించడానికి రోడ్లు వేసే కార్యక్రమంలో ఉన్నాం.. హబ్ అండ్ స్పోక్ మాడల్ లో రాష్ట్రంలో 20 పోర్టులు తయారు చేస్తాం. ఎయిర్ పోర్టులు విషయంలో మరో 9 ఎయిర్ పోర్టులు సిద్ధం కావాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి అయినా గంటలో వెళ్లాలి. ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ట్‌ను ప్లాన్ చేస్తే గత ప్రభత్వం దాన్ని పట్టించుకోలేదు. బకింగ్ హం కెనాల్‌తో కాకినాడ నుంచి చెన్నైకి సరుకుల రవాణా రూటు ఏర్పాటు చేయాలనుకున్నాం. 2000 సంవత్సరంలో 167 కిలో మీటర్లతో వేశాం.. దీంతో హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందింది. దానిని స్ఫూర్తిగా 187 కిలోమీటర్లు అమరావతి రింగ్ రోడ్డును కోరాం. ఆయన హమీ ఇచ్చారు. ఈ రోడ్డుతో 7 నేషనల్ హైవేని కనెక్టు చేస్తాం. నాగపూర్ హైవే కూడా కనెక్టు అవుతుంది. గ్రీన్ హైడ్రోజన్ గురించి, గ్రీన్ ఎనర్జీ గురించి గడ్కరీ చెప్పారు. సూర్యఘర్ కింద ఇంటి పైనే ఎస్సీలు, ఎస్టీలు విద్యుత్ ఉత్పత్తి చేసేలా కార్యక్రమం తీసుకున్నాం. బీసీలకు 3 కిలో వాట్స్ కు 93వేలు సబ్సిడీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.” అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.