Today Gold Price: భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Gold and Silver Price in Hyderabad on 5th December 2023: బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. అయితే గత కొన్ని నెలలుగా బంగారం ధరలు పెరగడమే తప్ప.. తగ్గడం లేదు. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (డిసెంబర్ 5) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,850 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64,200గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 400.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 440 పెరిగింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం నమోదైనవి.
గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,000లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,350గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,700లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 65,180గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 58,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 64,200గా కొనసాగుతోంది.
Also Read
Also Read: Cyclone Michaung: ఏపీ వైపు దూసుకొస్తున్న మిచాంగ్.. తమిళనాడులో విధ్వంసం
మరోవైపు దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర ఈరోజు రూ. 80,500లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఎలాంటి మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ. 80,500లు ఉండగా.. చెన్నైలో రూ. 83,500గా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 79,000గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 83,500లుగా ఉంది. వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 83,500గా కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!