గత కొన్ని రోజులుగా పెరుగుతున్న గోల్డ్ ధరలు కొనుగోలు దారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. రూ. లక్ష ను దాటి పరుగులు తీస్తుండడంతో కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇక నేడు పసిడి పరుగులకు బ్రేకులు పడ్డాయి. బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ తులం గోల్డ్ ధర రూ. 110 తగ్గింది. సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,686, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,795 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గింది. దీంతో రూ.97,950 వద్ద అమ్ముడవుతోంది.
Also Read:Hyderabad: జోరుగా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్‌ల దందా.. ఉచ్చులోపడి బలవుతున్న యువత..!
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 110 తగ్గింది. దీంతో రూ. 1,06,860 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,100 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,07,010 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,37,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,27,000 వద్ద ట్రేడ్ అవుతోంది.