పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు వేలల్లో తగ్గిపోయాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 450 తగ్గింది. కిలో సిల్వర్ ధర రూ. 2000 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,003, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,170 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 తగ్గింది. దీంతో రూ.91,700 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 450 తగ్గింది. దీంతో రూ. 1,00,030 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల 100 గ్రాముల బంగారం ధర రూ. 4500 తగ్గి రూ. 10,00,300 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:Indian Oil Companies: మోడీ సర్కార్కు అమెరికా షాక్.. భారత చమురు కంపెనీలపై ఆంక్షలు
విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,850 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,00,180 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,25,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,15,000 వద్ద ట్రేడ్ అవుతోంది.