Bihar: సార్ మేమెక్కడ కూర్చోవాలి.. ఆగ్రహించిన విద్యార్థినులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లోని వైశాలిలో విద్యార్థినుల ఉగ్రరూపం కనిపించింది. మహ్నార్ బాలికల ఉన్నత పాఠశాలలో తరగతిలో కూర్చోవడానికి స్థలం లేదని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. అంతేకాకుండా.. బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO) వాహనంపై విద్యార్థినులు రాళ్లు రువ్వారు. ఇటుకలు, రాళ్లతో దాడి చేయడంతో కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ సమయంలో పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన మహిళా పోలీసులకు, విద్యార్థినులకు మధ్య వాగ్వాదం జరగడంతో ఓ విద్యార్థి అపస్మారక స్థితికి వెళ్లిపోయింది.
Harsh Goenka: ఇస్రో ఛైర్మన్ జీతం ఎంతో తెలుసా..? అసలు విషయం బయటపెట్టిన ప్రముఖ పారిశ్రామికవేత్త
Also Read
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
వాస్తవానికి ఈ పాఠశాలలో 2 వేల 83 మంది బాలికలు చదువుతున్నారు. కానీ కేవలం 600 మంది బాలికలకు మాత్రమే సీటింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. మరోవైపు.. ఇక్కడ విద్యాశాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ కెకె పాఠక్ 75% హాజరు కావాలని ఆదేశించారు. దీంతో 75 శాతం హాజరుపై పర్యవేక్షణ జరుగుతోంది. అందువల్ల ఆ పాఠశాలలో హాజరు శాతం పెరిగింది. ఈరోజు(మంగళవారం) 1250 మందికి పైగా బాలికలు పాఠశాలకు హాజరయ్యారు.
Ileana : టాలీవుడ్ డైరెక్టర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఇలియానా..
వివరాల్లోకి వెళ్తే.. పాఠశాలకు వెళ్లిన విద్యార్థినులు తరగతి గదిలో కూర్చోవడానికి స్థలం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఆ తర్వాత మహనార్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అహల్య కుమారి అక్కడికి చేరుకుని విద్యార్థినులను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ విద్యార్థినులు వినకుండ ఆమె కారుపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. దీంతో కారు అద్దాలు పగులగొట్టారు. ఈ సమయంలో విద్యార్థినులు మహిళా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘర్షణలో ఓ విద్యార్థి స్పృహతప్పి పడిపోగా.. ఓ మహిళా పోలీసుకు కూడా గాయాలయ్యాయి.
Satyender Jain: సత్యేందర్ జైన్ బెయిల్ ఈనెల 25వరకు పొడిగింపు
అయితే మహిళా పోలీసు విద్యార్థినులు నిరసన చేస్తుండగా.. వారిని చెప్పుతో కొట్టిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీంతో కోపోద్రిక్తులైన బాలిక విద్యార్థులు మహ్నార్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వాహనంపై దాడి చేశామని చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే మహనార్ సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థినులను శాంతింపజేశారు. ఈ ఘటనపై మహనార్ బీఈవో అహల్య కుమారి మాట్లాడుతూ.. విద్యార్థినులను ఎవరో రెచ్చగొట్టారని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థినులు రోజూ పాఠశాలలో కూర్చునేవారని.. కానీ ఇలా గందరగోళానికి పాల్పడ్డారని బీఈవో తెలిపింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమే చెప్పారు.
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!