Rajput Issue: రాజ్‌పుత్ ఆగ్రహాన్ని చల్లార్చేందుకు రంగంలోకి బీజేపీ.. యోగీ, రాజ్‌నాథ్ సింగ్‌తో ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajput Issue:రాజ్‌పుత్ వర్గం బీజేపీపై మండిపడుతోంది. అయితే, ఈ కోపాన్ని తగ్గించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. క్షత్రియ సామాజికవర్గంలో బీజేపీపై నెలకొన్న కోపాన్ని తగ్గించేందుకు పార్టీ అగ్రనేతలు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రంగంలోకి దిగారు. వీరిని ఫతేపూర్ సిక్రీ, ఆగ్రాలో ప్రచారానికి బీజేపీ పంపుతోంది. రాజ్‌పుత్‌పై కేంద్రమంత్రి పురుషోత్తమ్ రూపాల వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు, సీట్ల పంపిణీపై అసంతృప్తి ఆ కమ్యూనిటీలో బీజేపీపై ఆగ్రహాన్ని పెంచాయి. ఫతేపూర్ సిక్రీలో సంఖ్యాపరంగా వీరి ఓట్లు ఎక్కువగా ఉండటంతో, అసంతృప్తిని చల్లార్చే పనిని బీజేపీ ప్రారంభించింది. ఫతేపూర్ సిక్రీ నుంచి బీజేపీ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నా జాట్ నాయకుడు రాజ్ కుమార్ చాహర్‌ని రంగంలోకి దించింది. మరోవైపు ఇండియా కూటమి క్షత్రియుడైన రామ్ నాథ్ సికార్వార్ని ఈ స్థానంలో పోటీకి నిలబెట్టింది.
Read Also: Prajwal Revanna scandal: సెక్సు టేపులపై తొలిసారిగా స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ..
Also Read
- Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ '45' స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
- Hyderabad: పక్కా ప్లాన్‌తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్‌లు..
బీజేపీని ఇరుకున పెట్టే అవకాశం లభించిందని కాంగ్రెస్ భావిస్తోంది. తన ప్రచారాన్ని వేగవంతం చేసింది. మే 3న ప్రియాంకా గాంధీ సికార్వార్ తరుపున ప్రచారం నిర్వహించబోతున్నారు. సికార్వార్ కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నాడు. స్థానికులు ఇచ్చే విరాళాలను ఉపయోగించి ప్రచారం చేస్తున్నారు. బీఎస్పీ తరుపున బ్రాహ్మణ వర్గానికి చెందిన రామ్ నివాస్ శర్మ పోటీ చేస్తున్నారు. మే 7న ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈ ప్రాంతంలో గణనీయంగా రాజ్ పుత్ వర్గం ఓటర్లు ఉన్నప్పటికీ, గత 15 ఏళ్లుగా ఆ వర్గానికి బీజేపీ టికెట్ ఇవ్వలేదని క్షత్రియుల తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఠాకూర్ పురాన్ సింగ్ అన్నారు. ఫతేపూర్ సిక్రీలో దాదాపు 3.50 లక్షల మంది క్షత్రియ ఓటర్లు ఉన్నారు. గెలుపోటములను వీరే డిసైడ్ చేయనున్నారు.
మరోవైపు రాజ్ పుత్ ప్రాబల్యమున్న ఘజియాబాద్‌లో రాజ్ పుత్ వర్గానికి చెందిన వీకే సింగ్‌ని కాదాని బనియా వర్గానికి చెందిన ఏకే గార్గ్‌కి బీజేపీ టికెట్ ఇవ్వడం కూడా వివాదం మరింత ముదరడానికి కారణమైంది. సైన్యంలో అగ్నివీర్ పథకం, EWS సడలింపు రాజ్ పుత్ ఆగ్రహానికి కారణమవుతోంది. రాజ్ కోట్ నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న పురుషోత్తం రూపాలా ఓ దళిత కార్యక్రమంలో మాట్లాడుతూ.. మహారాజులు తమ కుమార్తెలను బ్రిటిష్ వారికి ఇచ్చి వివాహం చేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం ప్రారంభమైంది. రూపాలా తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పినప్పటికీ.. గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ యూపీల్లో బలంగా ఉన్న రాజ్‌పుత్‌లో ఆగ్రహం నెలకొంది.
తాజావార్తలు
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
-
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!