Tirumala Tirupati: తిరుమలలో ఎల్‌నినో ఎఫెక్ట్.. మరో 120 రోజులకు మాత్రమే నీళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు కారణమవుతున్న ఎల్‌నినో ప్రభావం ఇప్పుడు కలియుగ వైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంపై తీవ్రంగా పడింది. సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో తిరుమల గిరులపై ఉన్న ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు ఆందోళనకర స్థాయిలో పడిపోయాయి. ప్రతిరోజూ వేలాదిగా తరలివచ్చే భక్తులకు మంచినీటి కొరత రాకుండా చూడటం ఇప్పుడు అధికారులకు సవాలుగా మారింది. దీనిని తీవ్రంగా పరిగణించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తమై తక్షణ నివారణ చర్యలకు ఉపక్రమించింది. రాబోయే రోజుల్లో భక్తులకు ఎలాంటి నీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.
ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలో కొండపై నెలకొన్న నీటి ఎద్దడిపై సుదీర్ఘంగా చర్చించిన టీటీడీ.. ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలు కేవలం మరో 120 రోజులకు మాత్రమే సరిపోతాయని అధికారికంగా ప్రకటించింది. సమావేశం ముగిసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొండపై నీటి సరఫరా నియంత్రణ చర్యలను వేగవంతంగా ప్రారంభించింది. ముఖ్యంగా తిరుమలలోని వ్యాపార సముదాయాలపై ఈ ఆంక్షల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కొండపై ఉన్న హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు నీటి సరఫరాలో భారీగా కోత విధించారు.
Also Read
ఇకపై ఈ దుకాణాలకు రోజులో కేవలం నాలుగు గంటల పాటు.. అనగా ఉదయం 2 గంటలు, అలాగే రాత్రి 2 గంటల సమయం మాత్రమే నీటిని సరఫరా చేయాలని టీటీడీ కఠిన ఆదేశాలు అమలు చేస్తోంది. ఈ హఠాత్పరిణామంతో హోటల్స్, ఫాస్ట్ ఫుడ్స్ యజమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అంతంతమాత్రంగా వచ్చే పరిమిత నీటితో వంటలు చేయడం, భక్తులకు భోజన వసతులు కల్పించడం, శుభ్రత పాటించడం వంటి పనులతో పాటు వ్యాపారాలు ఎలా నిర్వహించాలని వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు నీటి ఎద్దడి వాతావరణం నెలకొని ఉండగా.. తిరుమలలోని అన్నమయ్య భవన్ వద్ద జరిగిన మరో ఘటన భక్తులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. అన్నమయ్య భవన్ పరిసరాల్లో సుమారు 9 అడుగుల పొడవున్న భారీ జెర్రిపోతు సంచరించడం కలకలం రేపింది. ఊహించని విధంగా భారీ పాము ఎదురుపడటంతో భక్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ ఉద్యోగి భాస్కర్ నాయుడు ఎంతో చాకచక్యంగా ఆ పామును పట్టుకుని, సురక్షితంగా తీసుకెళ్లి దట్టమైన అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో భక్తులు, అధికారులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
- Tags
- El-Nino
- tirumala
- ttd
- water crisis
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!