Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
- ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై విజయం
- జస్ప్రీత్ బుమ్రాకు ముంబై కెప్టెన్‌గా తొలి విజయం
- 201 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించిన ముంబై
- తిలక్ వర్మ 33 బంతుల్లో అజేయంగా 75 పరుగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Indians Win: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తన తొలి విజయాన్ని అందుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ముంబై.. ఒక బంతి మిగిలి ఉండగా 205/4 స్కోరుతో మ్యాచ్‌ను ముగించింది. ఈ విజయానికి ప్రధాన కారణం తిలక్ వర్మ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్.
201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ దూకుడైన ఆరంభాన్ని అందించాడు. కేవలం 23 బంతుల్లోనే 48 పరుగులు చేసిన రికెల్టన్ నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోవైపు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 25 పరుగులతో కీలక సహకారం అందించాడు. మధ్య ఓవర్లలో మ్యాచ్ మోమెంటమ్ పూర్తిగా ముంబై వైపు తిప్పింది తిలక్ వర్మే. ఒత్తిడి పరిస్థితుల్లోనూ అద్భుతమైన షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 33 బంతుల్లోనే అజేయంగా 75 పరుగులు చేసి మ్యాచ్‌ను ఒంటిచేత్తో ముగించాడు. పంజాబ్ బౌలర్లు మధ్య మధ్యలో వికెట్లు తీసినా.. తిలక్ మాత్రం ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు.
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్‌దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్‌కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
చివర్లో విల్ జాక్స్ వేగంగా ఆడుతూ కేవలం 10 బంతుల్లో అజేయంగా 25 పరుగులు చేయడంతో ముంబై విజయానికి చేరువైంది. చివరకు ఒక బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి సంబరాల్లో మునిగిపోయింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ 32 బంతుల్లో 57 పరుగులతో పంజాబ్‌కు శుభారంభం అందించాడు. అనంతరం అజ్మతుల్లా ఒమర్జాయ్, జేవియర్ బార్ట్లెట్ కీలక పరుగులు జోడించడంతో పంజాబ్ భారీ స్కోరు నమోదు చేసింది.
అయితే ఆరంభంలో ఒత్తిడికి గురైన ముంబై బౌలర్లు తర్వాత పుంజుకుని పంజాబ్‌ను అదుపులోకి తెచ్చారు. కీలక సమయంలో వికెట్లు పడగొట్టడంతో మ్యాచ్ ముంబై వైపు మళ్లింది. చివరకు తిలక్ వర్మ సూపర్ ఫినిషింగ్‌తో ముంబై అభిమానులకు థ్రిల్లింగ్ విక్టరీ దక్కింది.
తాజావార్తలు
-
Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
-
Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్‌దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!