Site icon NTV Telugu

Ram mandir: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం.. హైదరాబాద్‌లో హైఅలర్ట్..

Hyd

Hyd

Ayodhya Ram Mandir Inauguration: ఇవాళ అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు పోలీసు కమిషనర్లు (సీఎస్‌పీ), పోలీసు సూపరింటెండెంట్‌లతో సమావేశం నిర్వహించి భద్రతా ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. సున్నితమైన అన్ని ప్రాంతాల్లో పోలీసులు అలర్ట్ గా ఉండాలని తెలిపారు. అలాగే, పక్కాగా బందోబస్త్ ప్లాన్ చేయాలని ఆదేశించారు. స్థానిక పోలీసులకు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (TSSP), గ్రే హౌండ్స్, సాయుధ రిజర్వ్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేంద్ర బలగాలు సహాయం అందిస్తాయని పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మతపరమైన సున్నితమైన ప్రదేశాలలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిద్ధంగా ఉంది.

Read Also: Cheteshwar Pujara: చెతేశ్వర్‌ పుజారా అరుదైన మైలురాయి!

అయితే, గత వారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎస్పీ స్థాయిలో వరుస శాంతి సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీసులు బాస్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని డీజీపీ రవి గుప్తా తెలిపారు. హైదరాబాద్‌లో స్థానిక పోలీసులకు సిటీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, కమిషనర్ టాస్క్ ఫోర్స్, TSSP అండ్ మౌంటెడ్ పోలీసులు మద్దతు ఇస్తారు అని ఆయన చెప్పుకొచ్చారు.

Read Also: Ayodhya Ram mandir: అయోధ్యలో పటిష్టమైన బందోబస్తు.. 10 వేల సీసీ కెమెరాలతో నిఘా

అలాగే, మతపరమైన సున్నితమైన ప్రదేశాలలో పోలీసు పికెట్‌లను భారీగా మోహరించినట్లు డీజీపీ రవి గుప్తా తెలిపారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రజల కదలికను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రత్యేక ప్రార్థనా సమావేశాలు నిర్వహించే ప్రదేశాలను గుర్తించి భద్రతా ఏర్పాట్లు ప్రారంభించాలని స్థానిక పోలీసులను డీజీపీ ఆదేశించారు. ఇక, సీనియర్ అధికారులు ముందు జాగ్రత్త చర్యగా నగరంలోని మతపరమైన సున్నిత ప్రాంతాలలో విడిది ఏర్పాటు చేసుకుని అక్కడే ఉండాలని వెల్లడించారు.

Exit mobile version