HCA Meeting: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) కీలక సమావేశం నేపథ్యంలో ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌లో భాగంగా, అనుమతులు లేని వ్యక్తుల ప్రవేశాన్ని నిరోధించేందుకు పోలీస్ యంత్రాంగం ముందస్తుగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుదీర్ బాబు స్వయంగా ఉప్పల్ స్టేడియానికి చేరుకొని భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సమావేశంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీస్ బలగాలను మోహరించారు.
Read Also:Tirupati: మా అమ్మకు నాన్న అంటే ఇష్టం లేదు.. అందుకే చంపేశాడు..!
ఈ సమావేశానికి 173 క్రికెట్ క్లబ్‌లకు చెందిన సెక్రటరీలు మాత్రమే హాజరు కావడానికి అనుమతించారు. గతంలో సస్పెండ్ అయిన క్లబ్ లకు చెందిన ప్రతినిధులకు ప్రవేశం లేదని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్పష్టం చేసింది. అనుమతిని పొందిన క్లబ్ సెక్రటరీల పేర్లను పోలీసులు లిస్టు ఆధారంగా పరిశీలిస్తున్నారు. లిస్టులో ఉన్నవారినే స్టేడియంలోకి అనుమతిస్తున్నారు. అనుమతి లేని వ్యక్తులు స్టేడియానికి చేరుకోకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నారు.
Anise Seeds: జీర్ణక్రియ మెరుగుపడాలంటే వీటిని తిని తీరాల్సిందే..!
HCAలో ఎప్పటికప్పుడు మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత పొందింది. దీనిలో భాగంగా భద్రతా ఏర్పాట్లు, ప్రవేశ నియంత్రణ మొదలైన అంశాల్లో పోలీసులు పటిష్టంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ క్రికెట్ రాజకీయాల నేపథ్యంలో ఈ కీలక సమావేశానికి సంబంధించి రాచకొండ పోలీసుల చర్యలు కట్టుదిట్టంగా ఉన్నాయి. నిబంధనలకు లోబడి సమావేశం సాగేందుకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది.