Tiger Hunt: పెద్ద శంకర్లపూడిలో పెద్దపులి ప్రత్యక్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసుల్ని ఓ పెద్దపులి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. 21 రోజులుగా
ప్రజలను అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న పెద్ద పులి ప్రత్తిపాడు మండలం పెద్ద శంకర్లపూడిలో రాత్రి ప్రత్యక్షం అయింది. దీనిని బంధించేందుకు బోన్లు, సీసీ కెమేరాలు ఏర్పాటుచేసినా ఒక్కో రోజు ఒక్కో దిశ మార్చుకుంటూ అలజడి కలిగిస్తోంది.
గురువారం రాత్రి 11 గంటల సమయంలో పెద్ద శంకర్ల పూడి ఆర్ఎంపీ డాక్టర్ ఇంటి వైపు వస్తుండగా కుక్కలు పెద్దఎత్తున అరవడంతో గ్రామస్తులు మేలుకొని అటువైపు వెళ్లే సరికి అక్కడినించి వెనుదిరిగి వెళ్లిపోయింది పెద్దపులి. ఇంటి గేట్ వరకు వెళ్లి వెను తిరిగినట్టు పాదముద్రల ద్వారా గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. త్తిపాడు మండలంలోని పెద్ద పూడి, చిన్నశంకర్లంపూడి, ఏలేశ్వరం మండలంలోని భద్రవరం, లింగంపర్తి, కొండ తిమ్మాపురం, సి.రాయవరం గ్రామాల్లో సంచరిస్తుంది పెద్ద పులి.
Also Read
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
మరోవైపు పెద్దపులి కోసం అన్వేషణ కొనసాగుతూనే వుంది. పెద్దిపాలెం సుబ్బారెడ్డి సాగర్ కుడి కాలువ గట్టు నుంచి గోకవరం సుబ్బారెడ్డి సాగర్ సమీప కొండల్లోకి పెద్దపులి ఇంతకుముందు వెళ్ళింది. గోకవరం నుంచి ఎరకంపాలెం, మెట్టు చింత, ఉలి గోగుల, వంతాడ కొండల పరిసరాల్లో ఉన్నట్టు సమాచారం. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకు సమీపంలోఉన్నట్టు కూడా అధికారులు చెబుతున్నారు. అక్కడ నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజవొమ్మంగి అడవులకు రెండు రోజుల్లో చేరుకుంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. పులిని బంధించేందుకు బృందాలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి.
తాజావార్తలు
-
Celebrity Wedding: 78 ఏళ్ల వయసులో మళ్లీ వరుడైన స్టార్ నటుడు.. భార్యతో మరోసారి పెళ్లి!
-
Stock Market: 27 నిమిషాల్లోనే రూ.2.82 లక్షల కోట్లు లాభం! స్టాక్ మార్కెట్లో ఈ రోజు ఇన్వెస్టర్లకు పండగే!
-
Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
-
Ather 450X Overtones: ఏథర్ కొత్త 450X ఓవర్టోన్స్ సిరీస్.. 900W ఫాస్ట్ ఛార్జర్, వాయిస్ కమాండ్తో మరింత స్మార్ట్!
-
Shruti Haasan : ఐడెంటిటీ కోల్పోతున్న శృతి హాసన్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?