Site icon NTV Telugu

Bengal Tiger Roaming: అనకాపల్లి జిల్లాలో పులి పంజా….టెన్షన్ టెన్షన్

Tiger 1

Tiger 1

తెలుగు రాష్టాల్లో పులుల సంచారం జనానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అనకాపల్లి మండలం మూలపేట సమీపంలో చిన్న కొండపై పెద్ద పులి తిష్ట వేసినట్టు తెలుస్తోంది. ఈరోజు 12 గంటల ప్రాంతంలో మేకలు మేపడానికి తీసుకువెళ్లిన రైతుకి పులి గాండ్రింపు వినిపించింది. దీంతో భయంతో కిందకి దిగి మేకలను తోలుకు వచ్చేశాడు రైతు. దీంతో భయాందోళన గురవుతున్నారు గ్రామస్తులు. అంతకుముందు ఉదయం పూట అనకాపల్లి మండలంలో బెంగాల్ టైగర్ మరోసారి పంజా విసిరింది. మూలపేట కొండల్లో మేకల మందపై దాడికి దిగింది.

Read Also: Komatireddy Venkatareddy: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరోసారి షోకాజ్ నోటీసులు

20 జీవాలను చంపేసింది బెంగాల్ టైగర్… మూలపేట కొండల్లో పులి తిష్ఠవేసిందని అటవీశాఖ అధికారులు అంచనాకు వచ్చారు. పులి సంచారంతో వణికిపోతున్నారు అటవీప్రాంత ప్రజలు.. ఇటు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో బజార్ హత్నూర్ ,అలాగే తలమడుగు మండలాల్లో మహరాష్ట్ర నుంచి వచ్చిన పులి సంచరిస్తుంది..మొన్న బజార్ హత్నూర్ మండలంలోని ఆవులమందపై దాడి చేసిన పులి ఓ ఆవును చంపేసింది..తాజాగా .తలమడుగు మండలంలో పల్సి బి శివారులో పులి దాడి లో ఎద్దు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు..

అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా స్పాట్ కు చేరుకున్న అధికారులు చనిపోయిన ఎద్దు కుచులాపూర్ గ్రామానికి చెందిన వెంకన్న కి చెందినదిగా గుర్తించారు…పులి సంచారం నిజమే అని సాయంత్రం,ఉదయంవేళల్లో అటవీ ప్రాంతాల వైపు వెళ్ళవద్దని హెచ్చరించారు. మహాముత్తారం మండలంలో మళ్లీ పులి సంచారం ఆందోళనకు కలిగింది. కనుకునూర్,ముకునూర్ గ్రామాల అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన 3 పశువులపై దాడి చేసి చంపింది పులి. ప్రజలు భయాందోళనలో వున్నారు.

Read Also: Kishan Reddy Counter To Kcr Live: కొండను తవ్వి ఎలుకను పట్టిన కేసీఆర్

Exit mobile version