సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ ప్రెస్ మీట్ కు కిషన్ రెడ్డి కౌంటర్ వేశారు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసీఆర్ కు విశ్వాసం లేదు.. నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు ఎక్కడినించి వచ్చారు? నిన్నటి సినిమా చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుందన్నారు కిషన్ రెడ్డి. ఫాం హౌస్ వీడియో విటలా చార్య సినిమాలా ఉంది.ఫామ్ హౌస్ ఫైల్స్ లో తొండను పట్టారు. పోలీసులు కేసీఆర్ కుటుంబం కోసం పనిచేస్తున్నారు. తెలంగాణలో అధికారుల ఫోన్లు, ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. దీనిపై విచారణకు సిద్ధమా? సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఫోన్ ట్యాపింగ్ పై విచారణకు కేసీఆర్ సిద్ధమా? కుటుంబ సభ్యులు కొంతకాలం, పాకిస్తాన్, శ్రీలంకలో ఉండి వస్తే తెలుస్తుంది. ఫామ్ హౌస్ విషయంలో ఏ విచారణకైనా బిజెపి సిద్ధం. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మాకు సాయం కావాలని మాకు ఆఫర్ ఇచ్చిన కేసీఆర్ ఇపుడు నీతులు చెప్తున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి.