బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘టైగర్ 3’.. నవంబర్ 12వ తేదీన దీపావళి కానుకగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. రూ.450కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది.యశ్‍రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్‌లో భాగంగా టైగర్ 3 చిత్రానికి మనీశ్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది..ఇదిలా ఉంటే టైగర్-3 మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సల్మాన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే టైగర్ 3 సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో డిసెంబర్ 12న స్ట్రీమింగ్‍కు రానుందని కొన్ని వార్తలు వచ్చాయి.. అయితే, టైగర్-3 మూవీ డిసెంబర్ 12న స్ట్రీమింగ్‍కు రాలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా ఈ విషయంపై ఇంకా అప్‍డేట్ ను ఇవ్వలేదు.
అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో టైగర్ 3 మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఓ స్పెషల్ డేను సెలెక్ట్ చేసుకుందని సమాచారం. టైగర్ 3 చిత్రాన్ని డిసెంబర్ 31వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని అమెజాన్ ప్రైమ్ వీడియో ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది.. 2023 సంవత్సరం చివరి రోజైన స్పెషల్ డే డిసెంబర్ 31న ఈ చిత్రం స్ట్రీమింగ్ మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.అయితే, ఈ విషయంపైనా ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.టైగర్ 3 మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా స్ట్రీమింగ్‍కు రానుంది.టైగర్ 3 మూవీ లో ఇమ్రాన్ హష్మి, రేవతి, సిమ్రన్, రిధి డోగ్రా, విశాల్ జెత్వా మరియు కుముద్ మిశ్రా కీలకపాత్రలు పోషించారు. ప్రీతమ్ మరియు తన్జూ టింకూ ఈ మూవీకి సంగీతం అందించారు. స్పై ఏజెంట్లుగా సల్మాన్, కత్రినా కైఫ్ యాక్షన్ సీన్లు టైగర్-3 మూవీకి హైలైట్‍గా నిలిచాయి. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోలు అయిన షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ క్యామియోలు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి.