కామాంధులు, పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కఠిన చట్టాలు అమలవుతున్నప్పటికీ మహిళలు, యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగుచూసింది. బరితెగించిన కామాంధులు భర్త కళ్లెదుటే భార్యను వేధించారు. అసభ్యకర మాటలతో రెచ్చిపోయారు. నన్నే నీ భర్త అనుకో.. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు అంటూ దారికి అడ్డంగా నిలబడి బీరు బాటిళ్లతో ఆకతాయిలు బెదిరింపులకు పాల్పడ్డారు.
Also Read:Virat Kohli: అన్ని ఆలోచించాకే రిటైర్మెంట్ ప్రకటించా.. కోహ్లీ హాట్ కామెంట్స్
భర్త, మరిది, ఆడపడుచుతో కలిసి బేగంపేటలోని ఓ పబ్కెళ్లి ఇంటికి రాత్రి11:30కి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎస్ ఆర్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద భర్తపై ముగ్గురు యువకులు దాడి చేశారు. వివాహితను వెంబడించారు. వారి నుంచి తప్పించుకుని డయల్ 100కి ఫోన్ చేశారు బాధితులు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురు ఆకతాయిలను అరెస్టు చేశారు. పంజాగుట్టకు చెందిన డి.సంపత్ (28), సందీప్ (28), కూకట్ పల్లికి చెందిన ఉమేష్ (28)లను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.