రోజురోజుకు మద్యం మత్తులో యువత చెడు దారుల్లోకి వెళుతోంది. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియకుండా వ్యవహరిస్తున్నారు. అలాంటి ఘటనే చెన్నైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని తిరువల్లికేణి వాలాజా రోడ్డు వద్ద నిన్న రాత్రి 11 గంటల సమయంలో మద్యం మత్తులో ముగ్గురు యవతులు రోడ్డుపై బైఠాయించినట్లు పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం అందింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని చూసే సరికి చెన్నై సిటీ బస్సు కింద ముగ్గురు మహిళలు పడుకొని ఉన్నారు. దీంతో షాక్‌కు గురైన మహిళా పోలీసులు బస్సు కింద ఉన్న ముగ్గురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే మద్యానికి బానిసైన స్థితిలో ఆ ముగ్గురు మహిళలు ఏం చేస్తున్నారో తెలియక గొడవకు దిగారు.
Also Read : Revanth Reddy : నేడు రేవంత్ రెడ్డి నిరుద్యోగ నిరాహార దీక్ష
దీంతో ముగ్గురు యువతులను పోలీసులు శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. వారు ఎంతకీ వినకపోవడంతో.. అనంతరం మహిళా పోలీసు ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో పోలీసులు ముగ్గురు యువతులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మద్యానికి అలవాటు పడిన వారిని విచారించగా, ఆ ముగ్గురూ కన్నగి నగర్ ప్రాంతానికి చెందిన మహిళలు అని తేలింది. తిరువల్లికేణి ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో భోజనం వడ్డించేందుకు పనికి వచ్చారని, పని ముగించుకుని వెళ్లేటప్పుడు మద్యం సేవించి.. మద్యం మత్తులో రోడ్డుపై పరుగులు తీశారని వెల్లడించారు. దీంతో రోడ్డుపై మద్యం సేవించిన ముగ్గురు మహిళలపై తిరువల్లికేణి పోలీస్ స్టేషన్ పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇంటికి పంపించారు.
Also Read : Road Accident: తుని దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా..