NTV Telugu Site icon

House Collapsed: మీరట్‌లో కూలిన మూడంతస్తుల భవనం, శిథిలాల కింద 8 మంది..!

Meerut

Meerut

ఉత్తరప్రదేశ్లోని మీరట్‌లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. లోహియా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాకీర్ కాలనీలో 50 ఏళ్ల నాటి మూడంతస్తుల భవనం కూలిపోయింది. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా శిథిలావస్థలో ఉన్న ఓ ఇల్లు కూలిపోయింది. దీంతో.. కుటుంబం మొత్తం శిథిలాల లోపలే చిక్కుకుపోయారు. ఇంట్లో ఉన్న 8 మందికి పైగా సమాధి అయినట్లు సమాచారం. స్థానిక పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

Read Also: NASA: రికార్డు స్థాయిలో భూమి చుట్టూ తిరుగుతున్న వ్యోమగాములు.. ఎంతమంది ఉన్నారంటే..?

సమాచారం ప్రకారం.. ఆ ఇల్లు నఫో అనే 50 ఏళ్ల మహిళకు చెందినది. నఫో ఇద్దరు కుమారులు సాజిద్, గోవిందలు తమ భార్యలు, పిల్లలతో కలిసి ఇంట్లో నివసిస్తున్నారు. కుటుంబం మొత్తం శిథిలాల కింద పడిపోయారు. ఈ కుటుంబం పాల వ్యాపారం నిర్వహిస్తూ జీవిస్తున్నారు. కింది అంతస్తులో గేదెలను కూడా కట్టేశారు. ఒక్కసారిగా ఇల్లు కూలిపోవడంతో గేదెలు కూడా శిథిలాల కింద పడి పోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో జేసీబీ లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Read Also: Indore: బ్యాంక్ ఉద్యోగి భార్యపై ఆర్మీ సైనికుడు అత్యాచారం.. తర్వాత ప్రైవేట్ పార్ట్‌లో..!

ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అంతే కాకుండా.. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సహాయక బృందాలు అక్కడికక్కడే సహాయక చర్యల్లో నిమగ్నమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Show comments