Yadadri Temple: 18న యాదాద్రి సందర్శనకు కేసీఆర్ సహా ముగ్గురు సీఎంలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yadadri Temple: ఈనెల 18న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూడు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు సందర్శించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ యాదాద్రీశుడిని దర్శించుకోనున్నారు. ఖమ్మంలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ కోసం ఖమ్మం వెళ్లనున్న ముఖ్యమంత్రులు.. దారిలో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్నట్లు సమాచారం. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ముఖ్యమంత్రుల పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రెసిడెన్షియల్ సూట్స్, హెలిప్యాడ్ స్థలాన్ని రాచకొండ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ పరిశీలించారు.
Khammam BRS Meeting: 100 ఎకరాల్లో సభ, 400 ఎకరాల్లో పార్కింగ్.. కనీవినీ ఎరగని స్థాయిలో..
Also Read
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
- Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
- Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
- CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
ఖమ్మంలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మంలో ఈ నెల 18న కనీవినీ ఎరగని స్థాయిలో బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దేశం మెచ్చేలా సభకు సన్నాహాలు చేస్తోంది. సభకు రెండు రోజుల ముందే ఖమ్మం నగరం భారీ కటౌట్లు, హోర్డింగ్‌లతో గులాబిమయమైంది. ఈ సభకు సుమారు 5 లక్షల మంది జనసమీకరణ చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ఇప్పటికే పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా.. ఈ బహిరంగ సభకు ముగ్గురు ముఖ్యమంత్రులు హాజరవుతారని ముందునుంచి చెప్పుకొస్తున్నారు. అయితే.. తెలంగాణ సరిహద్దు జిల్లా కావడంతో.. 3 రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఈ సభలో పాల్గొంటారని తెలుస్తోంది.
ముఖ్యమంత్రుల పర్యటన వివరాలు ఇలా..
* 18వ తేదీన ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి యాదాద్రికి బయల్దేరనున్న ముఖ్యమంత్రులు
* 2 ప్రత్యేక హెలిక్యాప్టర్లలో యాదాద్రికి కేసీఆర్, కేజ్రీవాల్, పినరయి విజయన్
* 11.30 గంటలకు యాదాద్రి కి చేరుకోనున్న ముగ్గురు సీఎంలు
* యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్న ముగ్గురు సీఎంలు
* 12.30 గంటలకు యాదాద్రి నుంచి ఖమ్మం బయలుదేరనున్న ముఖ్యమంత్రులు
* కంటి వెలుగు రెండో దఫా ప్రారంభోత్సవంలో పాల్గొననున్న ముగ్గురు ముఖ్యమంత్రులు
* 3.30 గంటలకు ఖమ్మం పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొననున్న సీఎం లు
* 4 గంటలకు ఖమ్మం నుంచి విజయవాడ వెళ్లిపోనున్న కేజ్రీవాల్, విజయన్
తాజావార్తలు
-
Mamitha Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి గుడ్‌బై!
-
Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
-
KCR : పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ భరోసా.. నల్లబెల్లిలో పరామర్శ.!
-
Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
-
Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!