Site icon NTV Telugu

Wall Collapse: విషాదం.. ఇంటి గోడ కూలి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

Wall Collapse

Wall Collapse

Wall Collapse: సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని నాగారం మండల కేంద్రంలో వర్షాలకు పాత ఇల్లు గోడ కూలి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. మృతులు శీను, రాములు, రామక్కగా గుర్తించారు. బుధవారం రాత్రి ఇంటి గోడ కూలి ఇంట్లో ఉన్న ముగ్గురు మృతి చెందినట్లు తెలిసింది.

Also Read: BRS: ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లును లోక్‌సభలో వ్యతిరేకించిన బీఆర్‌ఎస్.. వెనక్కి తీసుకోవాల్సిందే!

ఆ ఇంటి వైపు కరెంట్ బిల్ తీయడానికి వెళ్ళిన ఉద్యోగికి కూలిన ఇంట్లో మృతదేహాలు కనిపించడంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు హుటాహుటిన వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి గోడలు తడిసి ముద్దయ్యాయి. గ్రామ శివారులోని వ్యవసాయ పొలానికి సమీపంలో ఉన్న ఇంట్లో రాములు, రాములమ్మ నివాసం ఉంటున్నారు. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిలో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్న శ్రీనివాస్.. తల్లిదండ్రుల వద్దకు వెళ్లి రాత్రి అక్కడే పడుకున్నాడు. ముగ్గురి మృతితో గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఎవరి ఇంట్లోనైనా ఇలాంటి గోడలు ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Exit mobile version