తెలంగాణలో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. కాగా.. పోలింగ్ రాష్ట్రమంతటా ప్రశాంతంగా జరగ్గా, కొన్నిచోట్ల మాత్రం చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా.. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్-కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ తలెత్తింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా పరకాల మండలం నాగారంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలింగ్ సెంటర్ దగ్గర బీఆర్ఎస్-కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అక్కడే…