మాలిలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న ముగ్గురు భారతీయ కార్మికులు కిడ్నాప్ అయ్యారు. అల్ ఖైదాకు చెందిన అనుబంధ ఉగ్ర సంస్థ ఈ దారుణానికి పాల్పడింది. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ ఘటనతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో ముగ్గురు భారతీయ కార్మికులు కిడ్నాప్‌కు గురయ్యారు. కాయెస్ ప్రాంతంలోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీపై అల్-ఖైదాతో అనుబంధం ఉన్న జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్… JNIM అనే ఉగ్రవాద సంస్థ దాడి చేసింది. ఫ్యాక్టరీలోని కార్మికులను బందీలుగా తీసుకెళ్లింది. వారిలో ముగ్గురు భారతీయులు ఉన్నారు. ఈ ఘటనను భారత విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. అయితే, కిడ్నాప్‌కు గురైన వారి వివరాలను మాత్రం వెల్లడించలేదు..
READ MORE: CM Chandrababu: క్యాన్సర్‌తో బాధపడుతున్న కార్యకర్తకు సీఎం చంద్రబాబు ఫోన్‌లో పరామర్శ
ఐతే ఈ ఘటనపై… మాలి రాజధాని బమాకోలోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు, పరిశ్రమ యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుందని విదేశాంగశాఖ తెలిపింది. బాధిత కుటుంబాలతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది. ముగ్గురు భారతీయుల కిడ్నాప్ ఘటనన తీవ్రంగా ఖండించిన కేంద్ర సర్కార్.. బందీలను టెర్రరిస్టులు సురక్షితంగా విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మాలి ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు మాలి రాజధాని బమాకోలోని భారత రాయబార కార్యాలయం అధికారులు కూడా ఫ్యాక్టరీ యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నారు. బాధిత కుటుంబాలతో టచ్ లో ఉన్నారు. మాలిలోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, సహాయం కోసం రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని ఎంఈఏ సూచించింది. బందీలను త్వరగా, సురక్షితంగా విడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
READ MORE: MK Stalin: భాషా ఉద్యమం తమిళనాడు దాటింది.. ఠాక్రేల కలయికపై స్టాలిన్..