నటి ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు కలకలం రేపాయి. చంద్రశేఖర్ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. చంద్రశేఖర్ రెడ్డిపై విజయశాంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నరకం అంటే ఏంటో చూపిస్తాను అంటూ బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొంది. విజయశాంతి సోషల్ మీడియా అకౌంట్ ని చంద్రశేఖర్ రెడ్డి మెయిన్ టైన్ చేసేవాడు. సోషల్ మీడియాలో విజయశాంతిని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తానని నమ్మ బలికాడు చంద్రశేఖర్ రెడ్డి. ఇతన్ని నమ్మి పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పారు విజయశాంతి దంపతులు. ఆ తర్వాత సోషల్ మీడియా అకౌంట్ ని మెయిన్ టైన్ చేయకుండా వదిలిపెట్టాడు చంద్రశేఖర్ రెడ్డి.
Also Read:CSK vs KKR : వరసగా ఐదోసారి ఓడిన చెన్నై సూపర్‌కింగ్స్
అతడు చేసిన మోసంపై విజయశాంతి దంపతులు చంద్రశేఖర్ రెడ్డిని ప్రశ్నించారు. తనను ప్రశ్నించడంతో నరకమేంటో చూపిస్తానంటూ బెదిరింపులకు గురిచేశాడు. విజయశాంతిని బెదిరిస్తూ ఎస్ఎంఎస్, మెయిల్స్ పంపిస్తూ భయబ్రాంతులకు గురిచేశాడు చంద్రశేఖర్ రెడ్డి. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తాజాగా నటిస్తున్న మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. పవర్ ఫుల్ ఐపీఎస్ పాత్రలో అలరించబోతున్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది.