పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క వరుస సినిమాలతో మరో పక్క వారాహి యాత్రతో బాగా బిజీగా ఉన్నాడు. మరోవైపు పవన్ నటించిన తొలిప్రేమ సినిమా థియేటర్లలో రీరిలీజ్ కానున్న విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు రీ రిలీజ్ అవుతూ భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్ కెరీర్ లో అద్భుతమైన హిట్ గా నిలిచింది తొలిప్రేమ.. అందువల్ల తొలిప్రేమ రీ రిలీజ్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తాజాగా 50 అడుగుల కటౌట్ ఏర్పాటు చేయడం సోషల్ మీడియా వేదికగా బాగా వైరల్ అవుతుంది.ఒక రీరిలీజ్ సినిమా కోసం ఈ రేంజ్ లో కటౌట్ ను ఏర్పాటు చేయడం తొలిప్రేమ సినిమా విషయంలోనే జరిగిందని కొంతమంది వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ కటౌట్ ను సంధ్య థియేటర్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది..
తొలిప్రేమ సినిమా రీ రిలీజ్ లో టాప్ కలెక్షన్స్ సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.రీ రిలీజ్ చేసిన స్టార్ హీరోల సినిమాలలో పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా అత్యధిక కలెక్షన్స్ సాధించి టాప్ ప్లేస్ లో ఉంది.ఖుషి సినిమా రీ రిలీజ్ విషయంలో ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డు ను తొలిప్రేమ సినిమా బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు.ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయడానికి పవన్ డేట్స్ కేటాయిస్తున్నారు.. ఓజి సినిమా పూర్తి అయిన తరువాత పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు పూర్తి డేట్స్ కేటాయిస్తాడని సమాచారం. అలాగే ఎప్పుడో ప్రారంభం అయిన హరిహర వీరమల్లు సినిమా కు కూడా డేట్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.పవన్ చేస్తున్న సినిమాలు భారీ విజయం సాధించాలని పవన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.