50 ఏళ్ల తన స్టైల్,యాక్టింగ్ అండ్ మ్యానరిజమ్‌తో సౌత్ బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదిగారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా చిన్న చిన్న రోల్స్ నుండి హీరోగా మారి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగి దేశ విదేశాల్లో అత్యంత ఎక్కువ మంది అభిమానులు కలిగిన హీరోగా మారారు. తలైవర్, సూపర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ దేవుడిలా కొలుచుకుంటున్న రజనీ ఈ డిసెంబర్ 12 నాటికి 75 సంవత్సరాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన కొన్ని క్లాసిక్ సినిమాలను అడ్వాన్స్ టెక్నాలజీ జోడించి రీ రిలీజ్ చేయబోతున్నారు.
Also Read : Star Hero : సొంత ఇండస్ట్రీకి ఆ స్టార్ హీరో ఎందుకనో దూరంగా ఉంటున్నాడు
1992లో వచ్చిన అన్నామళైతో పాటు మరో రెండు సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. రజనీకాంత్, ఖుష్బు హీరో హీరోయిన్లుగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో 175 రోజులు ఆడి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పుడు ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇదే మూవీని తెలుగులో కొండపల్లి రాజాగా వెంకటేశ్, ఉపేంద్ర గోకర్ణ రీమేక్ చేశారు. అలాగే మీనా, రజనీకాంత్ నటించిన యజమాన కూడా రీ రిలీజ్ చేయబోతున్నారట. రజనీకాంత్ కెరీర్‌లో ది బెస్ట్ ఫిల్మ్స్‌లో ఒకటైన పడయప్ప అలియాస్ నరసింహా కూడా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ బర్త్ డే రజనీకి స్పెషల్ నటుడిగా 50 సంవత్సరాల కెరీర్ కంప్లీట్ చేసుకున్నారు రజనీ. ఈ నేపథ్యంలో ఈ సారి పుట్టిన రోజు వేడుకలు భారీగా చేస్తున్నారు. ఒక్క కోలీవుడ్ లోనే కాదు మలేషియాలో తలైవర్‌కు బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్న నేపథ్యంలో అక్కడ ఈ సినిమాతో పాటు భాషాను కూడా స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నారట. ఇవే కాదు ఆయన పుట్టిన రోజుకు మరిన్నీ ట్రీట్స్ ఉన్నాయి. జైలర్ 2 నుండి ఇంట్రస్టింగ్ అప్డేట్‌తో పాటు కమల్ తెరకెక్కించబోయే తలైవా 173 నుండి కూడా అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. రజనీ బర్త్ డే అంటే ఈ మాత్రం ఉండాలిగా మరి.