NTV Telugu Site icon

CM Revanth Reddy: సీఎం రేవంత్ బృందం విదేశీ పర్యటనలో కుదిరిన ఒప్పందాలు ఇవే..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో పలు ఒప్పందాలు కుదిరాయి. ఈ పర్యటనలో మొత్తం రూ.31532 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. దాదాపు 30,750 కొత్త ఉద్యోగాలు రానున్నట్లు తెలిసింది. మొత్తం 19 కంపెనీలతో సంప్రదింపులు.. ఒప్పందాలు జరిగింది. పలు కీలక ఒప్పందాలతో అమెరికా, దక్షిణ కొరియా పర్యటన విజయవంతంగా ముగిసింది.

Read Also: Hyderabad: సూసైడ్‌ చేసుకోవాలనుకున్న యువకులు.. టెక్నాలజీ సాయంతో కాపాడిన పోలీసులు

ఈ పర్యటనలో కుదిరిన ఒప్పందాలు ఇవే..

1. కాగ్నిజెంట్:
అమెరికా తర్వాత హైదరాబాద్‌లో అతి పెద్ద క్యాంపస్. దాదాపు 15,000 ఉద్యోగాలు.

2. వాల్ష్ కార్రా హోల్డింగ్స్:
WE-హబ్ లో 5 మిలియన్ డాలర్ల పెట్టుబడులు. అభివృద్ది చెందుతున్న తెలంగాణ స్టార్టప్‌లలో 100 మిలియన్ల పెట్టుబడి.

3. ఆర్సీసియం:
దాదాపు 500 హై-ఎండ్ టెక్ ఉద్యోగాలు.

4. స్వచ్ఛ్ బయో:
రూ.1000 కోట్ల పెట్టుబడులు. 500 మందికి ఉద్యోగాలు.

5. ట్రైజిన్ టెక్నాలజీస్:
హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ డెవెలప్మెంట్, డెలివరీ సెంటర్. దాదాపు 1000 ఉద్యోగాలు.

6. హెచ్​సీఏ హెల్త్ కేర్:
నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ విస్తరణ.

7. కార్నింగ్:
గ్లాస్ ట్యూబింగ్ ఫెసిలిటీ కేంద్రంలో వచ్చే ఏడాదిలో (2025) వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం.

8. వరల్డ్ బ్యాంక్:
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం, సహకారం.

9. వివింట్ ఫార్మా:
రూ.400 కోట్ల పెట్టుబడి, దాదాపు1000 మందికి ఉద్యోగాలు.

10. చార్లెస్ స్క్వాబ్:
హైదరాబాద్‌లో భారతదేశంలోనే మొదటి టెక్నాలజీ డెవెలప్మెంట్ సెంటర్.

Read Also: CM Chandrababu : కొత్త ఐటీ పాలసీపై సీఎం ఫోకస్‌.. నేడు కీలక సమీక్ష

దక్షిణ కొరియాలో శాంసంగ్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, జీఎస్ కల్టెక్స్, సెల్ ట్రయాన్ కంపెనీ ప్రతినిధులతోనూ సీఎం చర్చలు జరిపారు. హన్ రివర్ ప్రాజెక్టును సందర్శించి సియోల్ డిప్యూటీ మేయర్‌తో భేటీ అయ్యారు. శామ్‌సంగ్ హెల్త్ కేర్ యూనిట్‌తో సమావేశమై చర్చలు జరిపారు. అలాగే కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సీఎం రేవంత్‌రెడ్డి బృందం సందర్శించింది. కాల్‌టెక్స్ కంపెనీ ప్రతినిధులతో పెట్టుబడులపై చర్చలు జరిపింది. ఇప్పటికే వరంగల్ టెక్స్‌టైల్స్‌ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియా ఫెడరేషన్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీ సానుకూలంగా స్పందించింది. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ రాష్ట్రంలో మెగా కార్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. భారత్‌లోని హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఇంజనీరింగ్‌ ద్వారా ఒక మెగా టెస్టింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులు పెడతామని ఆ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డి బృందానికి తెలిపారు. అలాగే కొరియాలో పలు కంపెనీలు, వివిధ వ్యాపార, వాణిజ్య సముదాయాల ప్రతినిధులతో చర్చలు జరిపారు.