High-Protein Foods: ప్రోటీన్లు అన్నీ ఆరోగ్యకరం కాదు.. ఈ ఐదు ప్రోటీన్ ఫుడ్స్ యమ డేంజర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High-Protein Foods: ఎవరికి..? ఎప్పుడు..? ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయో చెప్పలేని పరిస్థితి.. దీంతో, యువతతో పాటు చాలా మంది కొంత వరకు ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెడుతున్నారు.. అంతేకాదు.. ప్రోటీన్ ఫుడ్ వైపు అడుగులు వేస్తున్నారు.. తాము తినే ఫుడ్‌లో ఫ్రోట్‌న్లు ఉండేవిధంగా చూసుకుంటున్నారు.. ప్రోటీన్‌ను ఎల్లప్పుడూ ఫిట్‌నెస్ హీరో అని పిలుస్తారు. కండరాలను నిర్మించడం, బరువు తగ్గడం లేదా ఫిట్‌గా.. ఆరోగ్యంగా ఉండటం అయినా, అందరూ ఎక్కువ ప్రోటీన్ తీసుకోమని చెబుతారు.. కానీ, మీరు రోజూ తినే అధిక ప్రోటీన్ ఫుడ్.. ఎంత డేంజరో తెలుసా? అనే చర్చ ఇప్పుడు సాగుతోంది.. ఫిట్‌నెస్ కోచ్ సీన్ ఫానింగ్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రోటీన్ ఫుడ్ గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.. దాని ప్రకారం.. పెరుగు, గుడ్లు, వేరుశెనగ వెన్న, ఎండిన పండ్లు, ప్రోటీన్ బార్‌లు వంటి కొన్ని సాధారణ ఆహారాలు ఆరోగ్యకరమైనవిగా అనిపించవచ్చు.. కానీ, వాస్తవానికి, అవి ఎల్లప్పుడూ అంత ప్రయోజనకరం కాదు అంటూ చెప్పుకొచ్చాడు సీన్..
మనం గుడ్డిగా తీసుకొనే కొన్ని ఆహారాలతో అధిక ప్రోటీన్ వస్తుందని అనుకుంటాం.. కానీ వాటిలో చాలా తక్కువ ప్రోటీన్ ఉంటుంది.. అంతే కాదు.. కొవ్వు, చక్కెర లేదా కేలరీలు ఉంటాయి, అవి మంచి కంటే ఎక్కువ హాని చేస్తాయి అని సీన్ పేర్కొన్నాడు.. మీరు ఈ వస్తువులతో మీ సమయాన్ని వృధా చేస్తున్నారా? లేదా? వాటిని తెలివిగా ఎలా ఉపయోగించాలో మీకు తెలుసా? అంటూ ఓ ప్రశ్న వేశాడు..
Also Read
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
* గ్రీకు పెరుగు: ప్రజలు గ్రీకు పెరుగును ప్రోటీన్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారంగా భావిస్తారు.. కానీ, సీన్.. ప్రకారం, ఫుల్ ఫ్యాట్ పెరుగు ప్రజలు అనుకున్నంత ప్రయోజనకరంగా ఉండదు. 100 గ్రాముల ఫుల్ ఫ్యాట్ గ్రీక్ పెరుగులో కేవలం 10 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటుందని, తక్కువ ఫ్యాట్ పెరుగులో దాదాపు 13 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని వివరించారు.. మీరు మీ ఆహారంలో ప్రోటీన్‌ను పెంచుకోవాలనుకుంటే, తక్కువ ఫ్యాట్ గ్రీక్ పెరుగును కొంత ప్రోటీన్ పౌడర్‌తో కలిపి తినండి. ఇది కేలరీలను తగ్గిస్తుంది మరియు ఎక్కువ ప్రోటీన్‌ను అందిస్తుందని చెప్పాడు..
* పీనట్ బటర్‌ను ప్రజలు ప్రోటీన్లలో బెటర్ అని అనుకునేలా చేస్తుంది. కానీ, వాస్తవం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. మీరు బొడ్డు కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే.. పీనట్ బటర్‌కు దూరంగా ఉండండి అని సీన్ సూచించాడు.. ఎందుకంటే పీనట్ బటర్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.. అంతేకాదు ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. దీంతో ఇది ఖచ్చితంగా బరువు పెరగడానికి దారితీస్తుందని హెచ్చరించాడు.
* గుడ్లను “సూపర్ ఫుడ్” అంటారు, అది నిజం. కానీ, ఒక గుడ్డులో కేవలం 6 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. ఉదయం రెండు గుడ్లు తినడం ద్వారా మీరు మీ రోజువారీ ప్రోటీన్ తీసుకోవడం పొందారని మీరు అనుకుంటే, అది పొరపాటే.. కనీసం నాలుగు లేదా ఐదు గుడ్లు తినండి అని సీన్ అంటున్నారు. అయితే, గుడ్లు మంచివే.. కానీ, సరైన మొత్తంలో మాత్రమే ప్రభావం చూపుతాయని పేర్కొన్నాడు..
* ప్రోటీన్ బార్లు మరియు తృణధాన్యాలు: ఈ రోజుల్లో, అధిక ప్రోటీన్ బార్లు, ప్రోటీన్ తృణధాన్యాలు, లేదా ప్రోటీన్ స్నాక్స్.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. కానీ, వీటిలో తరచుగా ప్రోటీన్ కంటే ఎక్కువ చక్కెర మరియు ప్రాసెస్ చేసిన పదార్థాలు ఉంటాయి. ప్యాకింగ్‌పై ప్రోటీన్ అని రాసినంత మాత్రాన అది ఆరోగ్యకరమైనదని అర్థం కాదు. చాలా ప్రోటీన్ బార్లు మరియు షేక్స్ తియ్యగా ఉంటాయి.. ఏదైనా బార్‌కోడ్‌తో ప్యాక్ చేయబడితే, కొనుగోలు చేసే ముందు లేబుల్‌ని తప్పకుండా చదవాలని సూచించాడు..
* డ్రై ఫ్రూట్స్: బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ వంటి గింజలు శరీరానికి మేలు చేస్తాయి.. కానీ, వాటిని ప్రోటీన్ మూలాలుగా పరిగణించడం పొరపాటే అంటున్నాడు.. డ్రై ఫ్రూట్స్ ప్రోటీన్‌కు పనికిరాని చిరుతిండి ఎందుకంటే వాటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.. వాటిని తక్కువ పరిమాణంలో తినడం మంచిది, కానీ, మీరు వాటిని గుప్పెడుగా తింటూ ఉంటే, మీరు త్వరగా బరువు పెరుగుతారని హెచ్చరించాడు..
తాజావార్తలు
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!