మోడీ 3.0లో ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణపై దృష్టి పెట్టవచ్చని పలువురు అభిప్రాయ పడ్డారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ వ్యూహం కాస్త మారినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం గత హయాంలో చమురు కంపెనీ పెట్టుబడుల ఉపసంహరణలో బిజీగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వ వైఖరి మారింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖను హర్దీప్ సింగ్ పూరీ బాధ్యతలు చేపట్టిన వెంటనే.. ప్రస్తుతం బీపీసీఎల్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ఉద్దేశం లేదని చెప్పారు.
READ MORE: Rainy Season : వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.. ఈ నియమాలు పాటించండి
పెట్టుబడుల ఉపసంహరణ ప్రశ్నకు సమాధానమిస్తూ.. చమురు, గ్యాస్ పిఎస్‌యుల నుంచి ప్రభుత్వానికి 19-20 శాతం రాబడి వస్తుందన్నారు. అందువల్ల ఇప్పుడు BPCLలో పెట్టుబడుల ఉపసంహరణ ఉద్దేశం లేదని.. అన్వేషణ, ఉత్పత్తిపై మరింత దృష్టి పెట్టడానికి ప్రణాళిక ఉందన్నారు. త్వరలో చమురు ఉత్పత్తిని రోజుకు 45,000 బ్యారెళ్లకు పెంచనున్నట్లు తెలిపారు. దీనితో పాటు ముడిచమురు ధర బ్యారెల్‌కు 75-80 డాలర్లకు చేరినప్పుడే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. గ్రీన్‌ఫీల్డ్ రిఫైనింగ్‌కు బిపిసిఎల్ అధునాతన దశలో ఉందని హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. పెట్రోలు, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించడం ఇంకా కష్టమన్నారు.
కాగా.. 2024 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో BPCL రూ. 19,000 కోట్ల కంటే ఎక్కువ నికర లాభాన్ని ఆర్జించింది. BPCL FY 2023-24 నాల్గవ త్రైమాసికంలో రూ. 4,789.57 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 30% తగ్గింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.6,870.47 కోట్లుగా ఉంది.