వర్షాకాలంలో పిల్లలు పలు రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి.  

శుద్ధి చేసిన తాగునీరు లేదా మరగించి చల్లార్చిన నీరు తాగేలా చూడాలి.

 మలేరియా, డెంగ్యూ ఇతర వ్యాధుల వ్యాప్తిని నివారించేలా పరిసరాలను శుభ్రంగా ఉంచాలి.

ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు రాకుండా తడి బట్టలు, బూట్లు తప్పనిసరిగా ఆరుబయట ఆరబెట్టాలి.

 భోజనానికి ముందు చేతులు బాగా కడుక్కునేలా చూడాలి.

స్కిప్పింగ్‌, హోపింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌ మొదలైన ఇండోర్‌ ఫిజికల్‌ యాక్టివిటీస్‌ వంటి శారీరక శ్రమ కలిగించే క్రీడలను ప్రోత్సహించాలి.

 పాస్ట్‌ ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌ తగ్గించాలి.

 వర్షాలు పడుతున్న సమయంలో  బయటికి వెళ్తున్నప్పుడు రెయిన్‌కోట్‌లు, గొడుగులు, గమ్‌ బూట్లు ఉపయోగించాలి.

 ఆహారంలో తులసి, దాల్చిన చెక్క, నిమ్మ, అల్లం, ఇతర మసాలా దినుసులు చేర్చాలి.

 దోమలు కుట్టకుండా దోమతెర ఉపయోగించాలి.