Site icon NTV Telugu

Scotland: అక్కడ డాక్టర్లు, టీచర్ల కొరత.. వారి జీతం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

Scotland

Scotland

జీతం ఎక్కువస్తుందనకుంటే ఎన్నో కంపెనీలు మారుతాం. ఎందుకంటే పైసల కోసమే కదా బ్రతికేది. కొందరు ఎక్కువగా డబ్బులు వస్తాయని విదేశాలకు కూడా వెళ్లి సంపాదిస్తారు. ఐతే ఇక్కడ ఏడాదికి జీతం కోటికి పైగా ఇస్తారంట. ఇంతకీ ఎక్కడనుకుంటున్నారా.. ఇండియాలో అయితే కాదు, స్కాట్లాండ్ లో.. స్కాట్లాండ్ పరిధిలోని కొన్ని చిన్న దీవుల్లో వైద్యుల కొరత, టీచర్ల కొరత ఉంది. అందుకోసమని అక్కడి ప్రభుత్వం.. ఓ ప్రకటన చేసింది. ఇక్కడ పనిచేసేందుకు ఉత్సాహవంతులైన వారు కావాలని.. డాక్టర్లకు ఏడాదికి రూ.1.57 కోట్లు, టీచర్లకు రూ.71.47 లక్షలు ఇస్తామని ప్రకటించింది.

Sandeshkhali: బెంగాల్‌లో మహిళలంతా సురక్షితమే.. ర్యాలీలో మమత సందేశం

స్కాట్లాండ్ కు చెందిన హెబ్రెడీస్ దీవుల సమాహారంలోని యూవీస్ట్, బెన్ బెక్యులా తదితర 6 దీవుల్లోకి వెళ్లేందుకు నిరాకరిస్తుండటంతో 40 శాతం అధిక వేతనాలు ఇచ్చేందుకు స్కాటిష్ ప్రభుత్వం సిద్ధమైంది. అక్కడ మొత్తం 4,700 మంది వైద్య సేవలు అందించాల్సి ఉంటుందని స్కాట్లాండ్ ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉంటే.. రమ్ ఐలాండ్ లో టీచర్ల కొరత ఉంది. అక్కడ కిన్లోచ్ అనే గ్రామంలో కేవలం 40 మందే నివాసిస్తారు. కాగా.. అక్కడి ప్రాథమిక పాఠశాలలో చదువుకునే విద్యార్థుల సంఖ్య ఐదుగురు మాత్రమే.

Mamata Banerjee: “మహిళలకు బెంగాల్ సురక్షిత రాష్ట్రం”.. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మమతా బెనర్జీ..

ఆ దీవుల్లో నివసించే జనాభా చాలా తక్కువ మంది కానీ, వారికి ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. మరోవైపు.. స్కాటిష్ ప్రభుత్వం డాక్టర్లు, టీచర్ల జీవిత భాగస్వాములకు కూడా ఆ దీవుల్లోనే ఉపాధి కల్పిస్తామని చెబుతుంది. అంతేకాకుండా.. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని అంటుంది. దీంతోపాటు.. వీరిని ఈ దీవులకు స్వాగతించే క్రమంలో ‘గోల్డెన్ హలో’ పేరిట రూ.9 లక్షల ప్రోత్సాహక నగదు కూడా అందిస్తామని తెలుపుతుంది.

Exit mobile version