Supreme Court: ఎన్నికల ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అవుతున్న వేళ దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిలో ఎలాంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్ స్లిప్‌లను క్రాస్ వెరిఫై చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత గురించి ఆరా తీసింది. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ పవిత్రంగా ఉండాలని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఆశించినది జరగడం లేదని ఎవరూ భయపడవద్దు అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం పేర్కొంది.
ఇది కూడా చదవండి: Yuvan Shankar Raja: పాపం రా.. ట్రోల్ చేసి అకౌంట్ లేపించేశారా?
Also Read
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఇటీవల కేరళలో జరిగిన మాక్ పోల్ గురించి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాసర్‌గోడ్‌లో మాక్ ఓటింగ్ జరిగిందని.. అక్కడ నాలుగు ఈవీఎంలను వీవీప్యాట్లతో సరిపోలిస్తే బీజేపీకి అదనంగా ఓట్లు వచ్చాయని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Panipuri : పానీపూరిని ఇష్టంగా లాగిస్తున్నారా?అయితే తస్మాత్ జాగ్రత్త..
ఎన్నికల ప్రక్రియలో పవిత్రత అవసరం అని.. అనుకున్న విధంగా జరగడం లేదని ఎవరూ ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పారదర్శక ఓటింగ్ నిర్వహణ కోసం ఎలాంటి విధానాలను పాటిస్తున్నారని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. దీంతో ఎన్నికల సంఘం తమ ప్రక్రియను న్యాయస్థానానికి వివరించింది.
ఇది కూడా చదవండి: Ponnam Prabhakar: దేవుడి పేరుతో బండి సంజయ్ రాజకీయలు చేస్తున్నారు..
తాజావార్తలు
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్‌లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్‌లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
-
CM Chandrababu: సైబర్ క్రైమ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లపై ఉక్కుపాదం.. నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
-
Rambha Urvashi Menaka Teaser: అల్లరి నరేష్ కామెడీకి దేవకన్యలు తోడైతే.. టీజర్లో అసలు కథ ఇదే!
-
Astrology: ఆగస్టు 12 బుధవారం దినఫలాలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..