క్యూట్ బ్యూటీ ఇవానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘లవ్ టూడే’ మూవీ తో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చింది. లవ్ టూడే మూవీ తెచ్చిపెట్టిన క్రేజ్ తో వరుస ఆఫర్లు అందుకుంటుంది. ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా నిలదొక్కుకుంటున్న ఆమె ఓ స్టార్ హీరో సినిమాలో నటించే చాన్స్ కొట్టేసింది. కానీ ఈ ఆఫర్ ని ఆమె తిరస్కరించింది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు ఈ భామ ఏకంగా దళపతి విజయ్ సినిమానే రిజెక్ట్ చేసిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దానికి కారణం కూడా ఉందని తెలుస్తుంది.. ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా గుర్తింపు పొందుతున్న ఈ భామ విజయ్ కు చెల్లిగా నటిస్తే కెరీర్ కి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని భయపడిందట. అందుకే దళపతి విజయ్ సినిమాను రిజెక్ట్ చేసినట్టు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది..
దళపతి విజయ్ ప్రస్తుతం ‘ద గోట్’మూవీ చేస్తున్నాడు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.ట్రైం ట్రావెల్ నేపథ్యంలో ఈ పాన్ ఇండియా సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం.. తండ్రికి జరిగిన అన్యాయాన్ని ట్రైం ట్రావెల్ చేసి హీరో ఎలా పగ తీర్చుకుంటాడనేది ఈ కథ అని తెలుస్తోంది. ఈ మూవీలో ప్రభుదేవా, అజ్మల్ మరియు ప్రశాంత్ తదితరుల కీలక పాత్రలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసమే చిత్ర యూనిట్ ఇవానాను సంప్రదించారని తెలుస్తుంది.. ఇందులో విజయ్ కి చెల్లి పాత్ర కోసం ఆమెను అడగ్గా వెంటనే నో చెప్పిందని సమాచారం.. దానికి కారణం ఏంటో రీసెంట్ గా ఓ తమిళ్ యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్య్వూలో వెల్లడించింది. హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు వస్తున్నాయని, అప్పుడే చెల్లి పాత్రలు చేస్తే తనకు హీరోయిన్ ఛాన్స్ లు తగ్గే అవకాశముందని అందుకే నో చెప్పానంటూ ఆమె చెప్పుకొచ్చింది.