NTV Telugu Site icon

Women’s Reservation Bill: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టడం హర్షణీయం : గోదావరి అంజిరెడ్డి

New Project (1)

New Project (1)

Women’s Reservation Bill: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం పట్టణంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు డాక్టర్ సి అంజిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి, పలువురు మహిళలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలకు చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్ కేటాయింపు బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడం, లోక్ సభలో ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. భారత దేశ మహిళల తరుపున, మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర మహిళల తరుపున ప్రధాని నరేంద్రమోడీకి, కేంద్ర మంత్రి వర్గానికి, భారతీయ జనతా పార్టీకి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

Read Also:GVL Narasimha Rao: అప్పటి నుంచే మహిళా రిజర్వేషన్లు అమలులోకి..!

అదేవిధంగా కచ్చితంగా పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశించినట్లు పేర్కొన్నారు. గతంలో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు మొదట పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది ఎన్డీఏ ప్రభుత్వమే. వరుసగా 4 సార్లు ప్రవేశ్ పెట్టింది మాత్రం బీజేపీనే అన్నారు. త్వరలో బిల్లు అమలు చేసేది బీజేపీ ప్రభుత్వమే అని.. గత పది సంవత్సరాలుగా బీజేపీ కమిటీల్లో నూ 33శాతం రిజర్వేషన్ ను అమలు చేసి తన చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. ఆర్థిక, విదేశీ వ్యవహారాల, రక్షణ లాంటి కీలక శాఖ లను సైతం మహిళల కు కేటాయించింది. 12 మందిని కేంద్ర మంత్రులుగా, 8 మందిని గవర్నర్‎లుగా, నలుగురు మహిళలను ముఖ్య మంత్రులు చేసిన ప్రభుత్వం బీజేపీ అన్నారు. దేశ చరిత్ర లో తొలిసారి పార మిలటరీ దళాల్లో సైతం మహిళలకు చోటు నిచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ సర్కారే అన్నారు. కేవలం మహిళల ఓట్ల కోసం ఎజెండా పెట్టే ఇండియా కూటమి నిజంగా మహిళలకు సమన్యాయం పట్ల చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‎లో ప్రవేశ పెట్టబోయే బిల్లుకు బేషరతుగా మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భూపాల్ రెడ్డి రామచంద్రపురం జిల్లా కార్యదర్శిసరస్వతి యాదిరెడ్డి రాంబాబు, మహిళా అధ్యక్షురాలు పూర్ణిమ జ్ఞానేశ్వరి, సరళ, రాణి తదితరులు పాల్గొన్నారు.

Read Also:Tomato Price: అప్పుడు ఆకాశానికి.. ఇప్పుడు పాతాళానికి.. టమాటా రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు