NTV Telugu Site icon

Waqf Act: నేడు పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు..!

Waqf Board, Amendment Bill

Waqf Board, Amendment Bill

వక్ఫ్ బోర్డులను శాసించే 1995 చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. దీంతో వక్ఫ్ బోర్డుల పనితీరులో పారదర్శకత ఉంటుందని కేంద్ర అభిప్రాయపడుతుంది. అయితే వక్ఫ్ చట్టాన్ని సవరించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదని ముస్లిం పర్సనల్ లా బోర్డు చెబుతోంది. వక్ఫ్ బోర్డు అధికారాల్లో కోత పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆరోపిస్తోంది. ఒకవేళ ఈ బిల్లుకు చట్ట బద్ధత కల్పిస్తే..వక్ఫ్ బోర్డులు మునుపటిలాగా ఏ ఆస్తిని స్వచ్ఛందంగా తమ ఆస్తిగా ప్రకటించలేవు.

READ MORE: Thangalaan : తెలుగు ఆడియన్స్ చూపించే ప్రేమకు కన్నీళ్లొస్తున్నాయి: చియాన్ విక్రమ్

వారు తమ బోర్డులలో మహిళల భాగస్వామ్యాన్ని కూడా నిర్ధారించుకోవాల్సి వస్తుంది. వక్ఫ్ బోర్డు చట్టం-1954 సవరణ బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు మోడీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే బిల్లు ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బిల్లును ప్రవేశపెట్టకముందే బీజేపీ తన మిత్రపక్షాలను ప్రలోభపెట్టడం ప్రారంభించిందన్న ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు జేడీ-యూ, ఎల్‌జేపీ (ఆర్‌), హెచ్‌ఏఎం, అప్నాదళ్‌ (ఎస్‌)తో చర్చలు జరిగాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే అతి పెద్ద మిత్ర పక్షం టీడీపీని కూడా సంప్రదించారు.

READ MORE:Marriage Dates: శుభ ముహూర్తాలు మొదలు.. 17, 18 తేదీల్లో వేలాది వివాహాలు!

ప్రతిపాదిత సవరణ బిల్లు ద్వారా, వక్ఫ్ బోర్డు చట్టంలో 40 ముఖ్యమైన సవరణలు ప్రతిపాదించబడ్డాయి. ఉదాహరణకు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు యొక్క కూర్పును మార్చడానికి చట్టంలోని సెక్షన్లు 9, 14 సవరించబడతాయి. సవరణ తర్వాత కౌన్సిల్, బోర్డులో మహిళల ప్రాతినిధ్యం తప్పనిసరి అవుతుంది. సవరణ బిల్లులోని అతి ముఖ్యమైన అంశం వక్ఫ్ బోర్డు అధికారాలను తగ్గించడం. బిల్లులోని నిబంధనల ప్రకారం.. రాష్ట్ర వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసిన వివాదాస్పద భూమిపై తాజాగా వెరిఫికేషన్ ఉంటుంది. బోర్డు క్లెయిమ్ చేసిన ఆస్తుల ధృవీకరణ తప్పనిసరి అవుతుంది. వక్ఫ్, యజమానుల మధ్య వివాదం ఉన్న వివాదాస్పద ఆస్తులను ధృవీకరించే నిబంధన కూడా ఉంది.

READ MORE:Wayanad: వయనాడు ఘటనలో 308కి చేరిన మృతుల సంఖ్య..చైనా ప్రధాని సంతాపం

మరోవైపు వక్ఫ్ చట్టాన్ని సవరించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదని ముస్లిం పర్సనల్ లా బోర్డు పేర్కొంది. వక్ఫ్ చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న బిల్లుపై అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. బోర్డు ప్రతినిధి డాక్టర్ సయ్యద్ ఖాసీం రసూల్ ఇలియాస్ మాట్లాడుతూ.. వక్ఫ్ చట్టం 2013లో దాదాపు 40 సవరణల ద్వారా వక్ఫ్ ఆస్తుల స్థితి, స్వభావాలను మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. తద్వారా వాటిని స్వాధీనం చేసుకోవడం సులభతరం అవుతుందన్నారు. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే వారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టవచ్చని తెలిపారు.