August 17 and 18 is Best Marriage Dates in Shravana Masam 2024: మూడున్నర నెలల తర్వాత శుభ ముహూర్తాలు మొదలయ్యాయి. గత ఏప్రిల్ 28 నుంచి శుక్ర మూఢమి, దీనికితోడు గురు మూఢమి రావడంతో వివాహాలకు అవాంతరం ఏర్పడింది. నేటి నుంచి శ్రావణమాసం మొదలైంది. దాంతో మూడు నెలల పాటు నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు శ్రావణంలో జరగనున్నాయి. ఆగష్టు 7 నుంచి 28వ తేదీ వరకూ శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి.
శ్రావణమాసం మొదలవ్వడంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఇప్పటికే చాలామంది సన్నద్ధమయ్యారు. శుభ కార్యక్రమాల్లో పాలుపంచుకునే పురోహితులు, కల్యాణ మండపాలు, బాజా భజంత్రీలు, బ్యుటీషియన్లు, ఫొటోగ్రాఫర్లు, ఈవెంట్ల నిర్వాహకులు, ప్రింటింగ్ ప్రెస్, బట్టలు, కిరాణం, పండ్లు, పూలు, క్యాటరింగ్‌తో పాటు నగల వ్యాపారులు శ్రావణమాస ముహూర్తాలకు రెడీ అయ్యారు. మూడు నెలల పాటు ఖాళీగా ఉన్న వీరంతా ఇప్పుడు చాలా బిజీ కానున్నారు.
Also Read: Olypics 2024 Schedule India: ఒలింపిక్స్‌లో నేటి భారత క్రీడాంశాలు ఇవే!
ఆగష్టు 5వ తేదీతో మొదలయ్యే శ్రావణమాసం.. సెప్టెంబర్ 3తో ముగుస్తుంది. అయితే ఆగష్టు 31 లూపే శుభకార్యాలు ముగించుకోవాలని పురోహితులు సూచనలు చేస్తున్నారు. ఆగష్టు 7, 8, 9, 10, 11, 15, 16, 17, 18, 21, 22, 23, 24, 28 తేదీల్లో పెళ్లిళ్లకు ముహూర్తాలు ఉన్నాయి. 17, 18 తేదీల్లో అత్యంత శుభ ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు పేర్కొన్నారు. ఈ రెండు రోజుల్లో వేలాది వివాహాలు జరగనున్నాయని చెబుతున్నారు.