వక్ఫ్ బోర్డు చట్టంలో భారీ సవరణలు చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ చట్టంలోని దాదాపు 40 సవరణలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
వక్ఫ్ బోర్డులను శాసించే 1995 చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. దీంతో వక్ఫ్ బోర్డుల పనితీరులో పారదర్శకత ఉంటుందని కేంద్ర అభిప్రాయపడుతుంది.
ఆన్‌లైన్ గేమింగ్ కు సంబంధించి జీఎస్టీని మార్చడంతో ఆ సంస్థలు భారీగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీంతో ఆ సంస్థలు భారీగా బకాయి పడ్డాయి. ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలు చెల్లించాల్సిన పన్ను బాకీలు దాదాపు 45,000 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నెల 11న ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినోలు, క్యాసినోలలో బెట్టింగ్‌ల పూర్తి ముఖ విలువపై 28 శాతం పన్ను విధించేలా ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ యాక్ట్, 2017 మరియు…
బాల్య వివాహలపై రాజస్థాన్ ప్రభుత్వం బిల్లును తీసుకురావాలని ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. కాగా, దీనిపై ప్రభుత్వం ప్రస్తుతం యూటర్న్ తీసుకున్నట్టు సమాచారం. మైనర్లతో సహా అన్ని వివాహాలను రిజిస్టర్ చేయాలని రాజస్థాన్ ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. అసెంబ్లీలో ఆమోదించిన ఈ చట్టాన్ని గవర్నర్ వద్దకు పంపారు. అయితే, రాష్ట్రంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో దీనిపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. రాజస్థాన్‌లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి. సాధారణ వివాహాలతో పాటుగా…