NTV Telugu Site icon

Toll Gate: గేటు తీయడం లేటయిందని.. టోల్ ఉద్యోగిని చంపేశారు

Toll Employee

Toll Employee

Toll Gate: కర్ణాటకలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున విధుల్లో ఉన్న టోల్ గేట్ ఆపరేటర్ గేటు తీయడం ఆలస్యమైందంటూ అతనిపై (26) కొందరు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో టోల్‌ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. బెంగళూరుకు 35 కి.మీ దూరంలో ఉన్న రామనగరకు సమీపంలోని బిడది పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ దాడి ఘటన జరిగింది. పవన్ నాయక్ బెంగుళూరు-మైసూర్ శేషగిరి టోల్ వద్ద బిడాడి సమీపంలో పని చేస్తున్నప్పుడు కారు వచ్చింది. అయితే, కారు ఫాస్ట్‌ట్యాగ్ నుండి పన్ను మినహాయించడంలో జాప్యం జరిగింది. దీంతో కారు గేటు వెనుక ఎక్కువసేపు వేచి ఉండాల్సి వచ్చింది.

Read Also:Fire Accident: ప్రకాశంలో భారీ అగ్నిప్రమాదం.. స్క్రాప్ మొత్తం దగ్ధం

పవన్ తో – కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. అది కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇది గమనించిన స్థానికులు వారికి సర్దిచెప్పంతో వివాదం ముగిసింది. దీంతో నలుగురు వ్యక్తులు కారును కొంతదూరం పోనిచ్చి.. అక్కడ ఆగిపోయారు. టోల్‌ప్లాజాలో పనిచేస్తున్న పవన్‌, అతడి సహచరుడు భోజనం కోసం టోల్‌గేటు బయటకు వచ్చారు. ఇది గమనించిన ఆ నలుగురు వ్యక్తులు.. వారిపై హాకీ కర్రలతో దాడి చేసి పారిపోయారు. ఈ ఘటనలో పవన్‌ కుమార్‌ ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు బెంగుళూరుకు చెందినవారిగా గుర్తించినట్టు చెప్పారు.

Read Also:Terrorist: ఆ రాష్ట్రాలపై నజర్ పెట్టిన ఉగ్రవాదులు..?

Show comments