Tamil Cinema 2025 : స్టార్స్ ను సైడ్ చేసి చిన్న సినిమాలను ఆదరించిన తమిళ తంబీలు
కోలీవుడ్ ఈ ఏడాది స్టార్స్ కన్నా యంగ్ బాయ్స్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటారు. సుమారు 200లకు పైగా సినిమాలు రిలీజైతే.. పట్టుమని 20 సినిమాలు కూడా ప్రాఫిట్ గెయిన్ చేయడంలో తడబడ్డాయి. కానీ లో బడ్జెట్ మూవీస్ కాసులు కొల్లగొట్టాయి. ఒకటి కాదు రెండు కాదు.. సుమారు పది సినిమాలు పాజిటివ్ రివ్యూస్‌తో పాటు మంచి వసూళ్లను రాబట్టుకున్నాయి. జీరో అంచనాలతో వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ సెంట్ పర్సెంట్‌కు పైగా ప్రాఫిట్ సొంతం చేసుకుని సెన్సేషనల్ హిట్ అందుకుంది. జస్ట్ రూ. 7 కోట్లతో తీసిన ఈ సినిమా ఏకంగా రూ. 90 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టుకుంది.
Also Read : JanaNayagan : జననాయగన్ రీమేక్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
Also Read
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
- Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
ప్రదీప్ రంగనాథన్‌కు తమిళ తంబీలు రెండు హిట్స్ అందించారు. డ్రాగన్ అండ్ డ్యూడ్‌తో డబుల్ ధమాకా టేస్ట్ చేశాడు జూనియర్ ధనుష్. ఈ రెండు సుమారు రూ. 35 కోట్ల బడ్జెట్‌తో తీసిన టూ ఫిల్మ్స్, వంద కోట్లకు పైగా కాసులు రాబట్టుకున్నాయి. ఇక విశాల్ మూవీ మదగజరాజా అయితే.. ఎప్పుడో కంప్లీటై..రూ. 12 ఏళ్ల పాటు ల్యాబ్‌లో మగ్గి.. ఈ ఏడాది మోక్షం దక్కించుకుంది. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా రూ. 50 కోట్లను రాబట్టుకుంది. సరైన హిట్ లేక సతమతమౌతున్న ధ్రువ్ విక్రమ్‌కు 2025 బైసన్ రూపంలో మంచి సక్సెస్ దొరికింది. విక్రమ్ వీర ధీర శూరన్‌తో పోల్చుకుంటే.. బెటర్ కలెక్షన్స్ చూశాడు ధ్రువ్. రూ. 55 కోట్లతో తెరకెక్కిన వీర ధీర శూరన్ రూ. 70 కోట్లు వసూలు చేస్తే.. బైసన్ రూ. 30 కోట్లతో తెరకెక్కి వంద కోట్లకు పైగా రాబట్టుకుంది.
ఈ మూవీస్సే కాదు ఫ్యామిలీ సినిమాలకు కనెక్ట్ అయ్యారు తమిళ తంబీలు. టూరిస్ట్ ఫ్యామిలీయే కాదు.. మరికొన్ని సినిమాలపై కాసుల వర్షం కురిపించారు. మణికందన్ హీరోగా తెలుగుమ్మాయి శాన్వీ మేఘన జోడీగా నటించిన కుడుంబస్తాన్ సాలిడ్ హిట్ నమోదు చేసింది. రూ. 8 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా నియర్లీ రూ. 30 క్రోర్స్ కొల్లగొట్టింది. రూ. 25 కోట్లతో తెరకెక్కిన విజయ్ సేతుపతి- నిత్యామీనన్ తలైవన్ తలైవి కూడా హండ్రెడ్ క్రోర్స్ క్రాస్ చేసింది. ఇక చిన్న సినిమాలుగా వచ్చి మంచి రెస్పాన్స్‌తో పాటు బ్రేక్ ఈవెన్ తెచ్చుకున్నాయి పెరసు, డీఎన్ఎ, అన్ పావం పల్లపోతు, మామన్, 3బీహెచ్‌కే చిత్రాలు. తమిళ బాక్సాఫీస్ దగ్గర పెద్ద హీరోలు ఫెయిలయితే.. చిన్న హీరోలు, లోబడ్జెట్ చిత్రాలే కోలీవుడ్ పరువును నిలబెట్టాయి.
తాజావార్తలు
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
-
Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
-
Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
-
Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!