ఒకప్పుడు టాలీవుడ్‌లో నంబర్ వన్ హీరోయిన్‌గా వెలిగిపోయిన ఇలియానా గత పదేళ్లుగా సౌత్ సినిమాల్లో ఎందుకు కనిపించడం లేదనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. అయితే తాజాగా నిర్మాత కాట్రాగడ్డ ప్రసాద్ వెల్లడించిన విషయాలు ఈ మిస్టరీ చిట్ట విప్పాడు. ఇలియానాపై సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ అధికారికంగా నిషేధం విధించిందని, ఆ వివాదం వెనుక ఒక భారీ మోసం ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : Sarvam Maya : ఓటీటీలోకి మలయాళ బ్లాక్ బస్టర్ ‘సర్వం మాయ’..
అసలు వివాదం ఏమిటంటే.. రవితేజ ‘దేవుడు చేసిన మనుషులు’ సమయంలో ఇలియానా ఒక తమిళ సినిమాకు కమిట్ అయ్యి, 40 లక్షల రూపాయల అడ్వాన్స్ తీసుకుందట. అయితే ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో, నిర్మాత తన డబ్బులు తిరిగి ఇవ్వమని కోరగా ఆమె నిరాకరించింది. తాను డేట్లు ఇచ్చానని, నిర్మాతలే వాడుకోలేదని వాదించింది. కానీ కౌన్సిల్ లాగ్ షీట్లు తనిఖీ చేయగా, ఆమె ఇచ్చినవి ఫేక్ డేట్లు అని, ఆ సమయాల్లో ఆమె వేరే సినిమాల షూటింగ్‌లో ఉందని తేలింది. దీంతో ఆమె మోసం బయటపడటంతో, డబ్బులు కడతారా లేక బ్యాన్ ఎదుర్కొంటారా అని ఛాంబర్ గట్టిగా హెచ్చరించింది. అయినప్పటికి డబ్బులు తిరిగి చెల్లించడానికి ఇలియానా..
మొండికేయడంతో సౌత్ ఇండస్ట్రీలో ఆమెపై నిషేధం అమల్లోకి వచ్చింది. ఆమెతో సినిమాలు చేయాలనుకున్న ఇతర నిర్మాతలకు కూడా.. ‘ఆమె తీసుకున్న 40 లక్షలు మీరు కడితేనే షూటింగ్‌కు అనుమతిస్తాం’ అని ఛాంబర్ వార్నింగ్ ఇచ్చిందట. ఫలితంగా ఏ నిర్మాత ఆమెతో సినిమా చేయడానికి ముందుకు రాలేదు. అలా అప్పట్లో వచ్చిన ‘స్నేహితుడు’ (త్రీ ఇడియట్స్ రీమేక్) సినిమానే ఆమెకు సౌత్‌లో చివరి చిత్రమైంది. దీంతో.. కేవలం 40 లక్షల కోసం పంతానికి పోయి, కోట్లు సంపాదించే కెరీర్‌ను ఇలియానా చేజేతులా పాడు చేసుకుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది.