The Raja Saab : సంక్రాంతి విలన్.. రాజా సాబ్ పోస్ట్ మార్టం ఫెయిల్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Raja Saab : ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘ది రాజా సాబ్’ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. టి.జి. విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటించారు. అయితే ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది, కానీ ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా ప్రీమియర్స్ పడిన మొదటి ఆట నుంచే సినిమాకి నెగిటివ్ టాక్ బలంగా ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయింది. దీంతో సినిమా రిజల్ట్ అయితే చాలా వరకు తేడా కొట్టింది. అయితే ఈ విషయం మీద తాజాగా స్పందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత విశ్వప్రసాద్.. తమ సినిమా కంటెంట్ బాగోకపోవడం కాదని, రిలీజ్ డేట్ విషయంలో కొంత కేర్ తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
సంక్రాంతి సీజన్ కావడం వల్లే తమ సినిమా వర్కౌట్ అయి ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇందులో లాజిక్ లేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే కంటెంట్ అటూ ఇటూగా ఉన్నా కూడా సంక్రాంతికి రిలీజ్ అయిన ఎన్నో సినిమాలు అద్భుతాలు సృష్టించాయి. కానీ ఈ సినిమా సంక్రాంతి సీజన్ లో రావడం వల్లే అనుకున్న స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదని విశ్వప్రసాద్ పేర్కొనడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆయన పోస్ట్మార్టం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించి ఉండాల్సిందని, ‘సీజన్ కరెక్ట్ కాదేమో’ అనే ఒక అభిప్రాయం సరైనది కాదేమో అని విశ్లేషకులు అంటున్నారు. అయితే మరి విశ్వప్రసాద్ ఏ అంశాలను బేరీజు వేసుకుని అలా అంచనాకు వచ్చారో మనకు తెలియదు కానీ, ఆయన మాట్లాడిన మాటలు మాత్రం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
Also Read
- Farmer Relief: కరువు వేళ రైతులకు దీపావళి కానుక.. ప్రతి రైతు ఖాతాలో రూ.5,000..!
- RC 17: సైలెంటుగా సుకుమార్ - చరణ్ సినిమా ఓపెనింగ్.!
- Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
- AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
తాజావార్తలు
-
The Raja Saab : సంక్రాంతి విలన్.. రాజా సాబ్ పోస్ట్ మార్టం ఫెయిల్?
-
Farmer Relief: కరువు వేళ రైతులకు దీపావళి కానుక.. ప్రతి రైతు ఖాతాలో రూ.5,000..!
-
RC 17: సైలెంటుగా సుకుమార్ – చరణ్ సినిమా ఓపెనింగ్.!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!