The Raja Saab Runtime: తగ్గిన ‘ది రాజాసాబ్’.. ఫైనల్ రన్ టైం ఇదే!
- వచ్చే వారమే థియేటర్లోకి 'ది రాజాసాబ్'
- రాజాసాబ్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి
- U/A సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Raja Saab Final Runtime: రెబల్ స్టార్ ‘ప్రభాస్’ నటించిన హార్రర్ ఫాంటసీ మూవీ ‘ది రాజాసాబ్’. ఈ చిత్రం వచ్చే వారమే థియేటర్లోకి రాబోతోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే ముందు రోజే ప్రీమియర్స్ షోస్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు.
మరోవైపు రాజాసాబ్ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ మూవీకి U/A సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా తెలిసింది. అలాగే ఈ సినిమా రన్ టైం కూడా రివీల్ అయింది. 183 నిమిషాలు అంటే.. మూడు గంటల మూడు నిమిషాల రన్ టైంతో రానున్నట్టుగా తెలిసింది. కానీ ఇప్పుడు రన్ టైం కాస్త తగ్గినట్టుగా తెలుస్తోంది. సెన్సార్ కట్స్ తర్వాత ఫైనల్‌గా రెండు గంటల 55 నిమిషాలు లాక్ చేసినట్టుగా సమాచారం. అంటే రాజాసాబ్ రన్ టైం మూడు గంటల లోపే అన్నమాట. ఈ రన్ టైం సినిమాకు కలిసొచ్చే అంశమే అని చెప్పాలి.
Also Read
- NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
- Shreyas Iyer Record: టీ20ల్లో శ్రేయస్ అయ్యర్ కొత్త రికార్డు.. ధోనీ, కోహ్లీ సరసన చేరిన కెప్టెన్..
- 45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..
- India Unwanted Record: ఇంగ్లండ్ ధాటికి చిత్తైన భారత్.. చరిత్రలో తొలిసారి చెత్త రికార్డు
ఇక ది రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లో రొమాన్స్ చేస్తున్నాడు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రాజాసాబ్ నుంచి మూడు సాంగ్స్ రిలీజ్ కాగా.. త్వరలోనే మరో సాంగ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. మరి ఈ సంక్రాంతికి రాజాసాబ్ ఎలా ఎంటర్టైన్ చేస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Suriya Remuneration: ‘కరుప్పు’ సక్సెస్‌తో 100 కోట్ల క్లబ్‌లోకి సూర్య?
-
Pakistan Cargo Plane Missing: ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న పాకిస్తానీ కార్గో విమానం.. అరేబియా సముద్రంపై గల్లంతు
-
NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
-
Lenin : రిజనబుల్ ధరకే ‘లెనిన్’ నైజాం టికెట్ ధరలు
-
R Madhavan: అందమైన హీరోయిన్ల మధ్య ఉన్నా భార్యను ఎందుకు మోసం చేయలేదో చెప్పిన స్టార్ యాక్టర్!
ట్రెండింగ్
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్‌తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!