NTV Telugu Site icon

Minister Kandula Durgesh: రైతులకు రూ.1,600 కోట్ల బకాయిలు పెట్టారు..

Kandula Durgesh

Kandula Durgesh

Minister Kandula Durgesh: రాష్ట్రంలో రైతులకు గత ప్రభుత్వం 1600 కోట్లు బకాయిలు పెట్టింది. వాటన్నింటినీ చెల్లించడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు మంత్రి కందుల దుర్గేష్‌.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో గత ప్రభుత్వం వ్యవస్థల్ని అస్తవ్యస్తమైన పరిస్థితులలోకి నెట్టేసింది.. సీఎం చంద్రబాబు అనుభవం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంకల్పంతో రాస్ట్రాన్ని చక్కదిద్దే ప్రయత్నాలు మొదలయ్యాయన్నారు. తమ కూటమి ప్రభుత్వం వచ్చి నెలరోజుల్లోనే అభివృద్ధిని, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెల్లే కార్యాచరణ మొదలైందని.. అందులో భాగమే ఆర్థిక భారంగా వున్నా ఒకే రోజులో పెంచిన పెన్షన్ లు పంపిణీ చేశాం అనివెల్లడించారు.. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నాం అన్నారు..

Read Also: NEET-UG paper leak: నీట్-యూజీ పేపర్ లీకులో మరో సూత్రధారి అరెస్ట్..

ఇక, జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు ఎలా వుండాలో జిల్లా అధికారుల సమావేశంలో చార్చించాం అన్నారు కందుల దుర్గేష్‌.. ఎక్కువసార్లు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి సమీక్షలు నిర్వహించుకోవడం ద్వారా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు, ప్రజల అవసరాలు సకాలంలో తీర్చగలం అన్నారు.. ఇరిగేషన్, వ్యవసాయం, రోడ్లు, గ్రామీణాభివృద్ధి, ఆర్టీసీ, టూరిజం, పుష్కరాలు వంటి ప్రాధాన్యత రంగాలుపై జిల్లా అధికారులతో చర్చించాం .. వచ్చే సమావేశానికి సమగ్రప్రణాళికతో రావాలని అదేశించామని వెల్లడించారు.. జిల్లాలో రైతులకు 7కోట్ల రూపాయలే బాకీ వున్నాం.. రాష్ట్రంలో రైతులకు గత ప్రభుత్వం 1600 కోట్లు బకాయిలు పెట్టింది. వాటన్నింటినీ చెల్లించడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.. రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా మారుస్తూ మెరుగైన సేవలు రైతులకు అందిస్తాం.. పెరిగిపోయిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గించడానికి చర్యలు చేపట్టాం.. కిలో బియ్యం 49లేదా 48 రూపాయలకు, కందిపప్పు 160 రూపాయలకు అమ్మకాలు రైతు బజార్లలో ప్రారంభించినట్టు ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి కందుల దుర్గేష్‌.