NTV Telugu Site icon

Bhatti Vikramarka: సూర్యాపేట జిల్లాలో కొనసాగుతున్న భట్టి పాదయాత్ర

Batti Vikramarka

Batti Vikramarka

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర.. 105వ రోజు సూర్యపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని మోతే నుంచి ప్రారంభమైంది. హుసేనాబాద్, మామిళ్ళగూడెం వరకు ఇవాళ పాదయాత్ర కొనసాగనుంది. మామిళ్ళగూడెం వద్ద భట్టి విక్రమార్క లంచ్ బ్రేక్ తీసుకోనున్నాడు. సాయంత్రానికి ఖమ్మం జిల్లాలోకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రవేశించనుంది.

Read Also: Allu Arjun: అల్లు అర్జున్ ఎన్ని రకాల బిజినెస్ లను చేస్తున్నాడో తెలుసా?

అయితే.. మోతే పాదయాత్ర శిబిరం వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు, కాంగ్రెస్ నేతలు పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు అని ఆయన పేర్కొన్నారు. నా పీపుల్స్ మార్చ్ లో ప్రజలు తమ కష్టాలను, చెప్పుకున్నారు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సాగునీరు అందించడంలో అధికార పార్టీ విఫలమైంది అని అన్నాడు.

Read Also: Kanaka Durga temple: దుర్గ గుడిలో మరో వివాదం.. వైరల్‌గా మారిన వీడియో

కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో వచ్చింది అని భట్టి విక్రమార్క అన్నారు. జలయజ్ఞంలో భాగంగా కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన సాగునీటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. అధికార పార్టీ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయకపోగా…. ప్రాజెక్టుల నిర్వహణలో కూడా ఘోరంగా విఫలమైంది.

Read Also: PV Narasimha Rao: పీవీ నరసింహారావుకు నివాళులు అర్పించిన తలసాని, సత్యవతి

ఈరోజు నా పాదయాత్రలో ముఖ్య నేతలు పాల్గొనే అవకాశం ఉంది అని భట్టి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ అభివృద్దికి కృషి చేయాలని భట్టి విక్రమార్క అన్నారు. అధికార పార్టీకి కాంగ్రెస్ పార్టీనే చెక్ పెడుతుందని భట్టి అన్నారు.