Ayodhya Ram Mandir : ఈరోజు అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ప్రత్యేక అతిథులు వచ్చారు. అయితే అయోధ్య రామ మందిరం కొత్తేమీ కాదు. ఇది ఇప్పుడు పునర్నిర్మించబడింది. అంతకు ముందు అక్కడ రామ మందిరం ఉండేది. రాముని విగ్రహం కూడా ఉంది. మరి ఇప్పుడు కొత్త విగ్రహం ఏర్పాటు చేస్తే పాత విగ్రహాన్ని ఏం చేస్తారనేది అందరిలోనూ సందేహంగానే ఉంది. అన్న సందేహాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కూడా నివృత్తి చేస్తోంది.
Read Also:Anupama Parameswaran: చెవిలో పువ్వుతో మూసి మూసి నవ్వులతో మైమరిపిస్తున్న.. అనుపమ పరమేశ్వరన్
గర్భగుడిలోనే పాత విగ్రహం
శిల్పి అరుణ్ రాజ్‌యోగ్ రూపొందించిన రామ్ లల్లా విగ్రహాన్ని జనవరి 22న ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అంతకు ముందు అయోధ్యలో సీతతో పాటు శ్రీరామచంద్రుడి విగ్రహం ఉండేది. వారితో పాటు లక్ష్మణుడు, హనుమంతుడు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ విగ్రహాలను ఏం చేస్తారని అడిగితే…మేము వాటిని ఏమీ చేయము. వారు ఇక్కడే ఉంటారు. కొత్త విగ్రహాలతో పాటు పాత విగ్రహాలను కూడా గర్భగుడిలో ఉంచుతామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
Read Also:Ayodhya Ram Mandir : రాముడు వచ్చే వేళా విశేషం.. ఉత్తర ప్రదేశ్కు కాసుల వర్షం
121 మంది పండితులు..
ప్రాణ ప్రతిష్ట కంటే ముందు చేయాల్సిన క్రతువులు జనవరి 16 నుంచి ప్రారంభమై.. ఈ నెల 21 వరకు కొనసాగాయి. ఈ కార్యక్రమాల్లో 121 మంది పండితులు పాల్గొంటారని చంపత్ రాయ్ తెలిపారు. వీటన్నింటిని ట్రస్టు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. వీటన్నింటిని ప్రిన్సిపాల్ ఆచారి గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ పర్యవేక్షిస్తారు. ప్రాణ ప్రతిష్ట అనంతరం అందరూ ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామని, అందరూ ప్రశాంతంగా రాముడిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తామని కమిటీ నిర్వాహకులు చెబుతున్నారు.