Site icon NTV Telugu

Chhattisgarh: ఫోన్ అధికంగా వాడుతున్న భార్య.. రెండో ఫ్లోర్ నుంచి తోసేసిన భర్త

Chhattisgarh

Chhattisgarh

ప్రస్తుతం అందరూ స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు చక్కటి సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి . వివాహ బంధాలను బలహీనపరిచి.. భర్తపై భార్య.. భార్యపై భర్త.. అనుమానాలు పెంచుకుంటున్నారు. కొందరైతే చంపేయడానికి కూడా వెనకాడటం లేదు. అలాంటి ఘటనే ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో వెలుగులోకి వచ్చింది. తన భార్య మొబైల్‌ ఫోన్‌ అధికంగా వాడిందన్న కారణంతో భర్త ఆమెను రెండో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. ఆమె తీవ్రంగా గాయపడగా.. డీకేఎస్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. వికాస్ నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

READ MORE: UP: స్నేహితురాలి బర్త్‌డే సెలబ్రేషన్‌లో క్లాస్‌మేట్స్ దుశ్చర్య.. దళిత టెన్త్ విద్యార్థి ఆత్మహత్య

సునీల్ అనే వ్యక్తి రాజధాని రాయ్‌పూర్‌లోని వికాస్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. పని నుంచి అలసిపోయి ఇంటికి వచ్చాడు. తన భార్యను అన్నం పెట్టమని అడిగాడు. ఆమె పట్టించుకోకుండా మొబైల్‌ని చూస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే అలసి పోయిన సునీల్ ఆగ్రహం పెంచుకున్నాడు. భార్యను ఇంట్లో నుంచి రెండో అంతస్తు బాల్కనీలోకి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి కిందకు తోసేశాడు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన వెంటనే చుట్టుపక్కల వారు పోలీసులతో పాటు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. మహిళను డీకేఎస్‌ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. హత్యాయత్నం సెక్షన్ల కింద భర్తపై గుధియారి పోలీసులు కేసు నమోదు చేశారు.

READ MORE: PM Modi: జనవరి 8న ఏపీకి ప్రధాని.. రూ. 85 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు!

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. ఏడేళ్ల బుడతడు.. ఫోన్‌‌ లేకుండా క్షణం ఉండలేకపోతున్నాడు. ఫోన్ లాక్కుంటే బూతులు తిడుతున్నాడు. ఫోన్ ఇచ్చేదాక నానా హంగామా చేస్తున్నాడు. తలను గోడకు బాదుకోవడం, తండ్రిని కొట్టడం, బిల్డింగ్‌‌పై నుంచి దూకుతానని బెదిరించడం వంటి వయసుకు మించిన చేష్టలను చూసి తండ్రికి భయం పట్టుకుంటుంది. ఇది పిల్లల్లోనే కాదు పెద్దల్లో కూడా దర్శనమిస్తోంది.

Exit mobile version