Site icon NTV Telugu

Video Viral: వీడు అసలు భర్తేనా.. భార్యను ఫ్లైఓవర్‌పై నుంచి తోసేసుందుకు ప్రయత్నం

Viral

Viral

ఓ వ్యక్తి తన భార్యను ఫ్లై ఓవర్‌పై బహిరంగంగా కొడుతూ తోసేసుందుకు ప్రయత్నం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది. భార్యను కొడుతున్న వీడియో వైరల్ కావడంతో.. నిందితుడు భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు రోషన్ గా గుర్తించారు. ఆ వీడియోలో చెన్నైలోని కోయంబేడు ఫ్లై ఓవర్‌పై రోషన్ తన భార్యపై దాడి చేస్తున్నట్లు స్పష్టంగా చూడవచ్చు. అయితే.. ఈ వీడియోను ఫ్లై ఓవర్‌పై ఉన్న బాటసారులు తమ ఫోన్లలో చిత్రీకరించారు.

Prajwal Revanna sex scandal: జేడీఎస్ నుంచి ప్రజ్వల్ రేవణ్ణని బహిష్కరించే అవకాశం..

కాగా.. ఈ ఘటనపై పోలీసులు భర్త రోషన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేసినట్లు గ్రేటర్ చెన్నై పోలీసులు ట్విట్టర్‌లో తెలిపారు. నిందితుడిపై తదుపరి చర్యలు చేప్టటేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో డాక్టర్ కార్తీక్ కుప్పన్ అనే యూజర్ పోస్ట్ చేశాడు. కార్తీక్ కుప్పన్ అన్నాడీఎంకే పార్టీ సభ్యుడు. “చెన్నైలో యువతిపై ఓ యువకుడు దారుణంగా దాడి చేశాడు. ఫ్లైఓవర్ పై నుంచి తోసేసి చంపే ప్రయత్నం చేశాడు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?’’ అని పోస్ట్ చేశాడు. దానికి సమాధానంగా పోలీసులు రీ పోస్ట్ చేశారు. నిందితుడు భర్తపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని.. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

CM YS Jagan: ప్రచారంలో వైసీపీ దూకుడు.. సీఎం జగన్‌ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇదే..

Exit mobile version