NTV Telugu Site icon

Allahabad High Court: శ్రీకృష్ణ జన్మభూమి కేసులో ముస్లిం వర్గానికి షాక్.. పిటిషన్‌ తిరస్కరణ

Hindu

Hindu

మధురలోని శ్రీ కృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆర్డర్ 7 రూల్ 11పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముస్లిం పక్షం దఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ మయాంక్‌ కుమార్‌ జైన్‌ సింగిల్‌ బెంచ్‌ తీర్పు వెలువరించింది. శ్రీ కృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు వివాదానికి సంబంధించిన పిటిషన్‌ల నిర్వహణను ముస్లిం పక్షం హైకోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. పూజా స్థలాల చట్టం, వక్ఫ్ చట్టం, పరిమితి చట్టం, నిర్దిష్ట స్వాధీన ఉపశమన చట్టాన్ని ఉటంకిస్తూ హిందూ పక్షం పిటిషన్‌లను కొట్టివేయాలని ముస్లిం పక్షం వాదించింది. ఈ పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. అదే సమయంలో.. సివిల్ దావా నిర్వహణకు సంబంధించి హిందూ పక్షం పిటిషన్లను హైకోర్టు స్వీకరించింది.

READ MORE: Mohammed Deif: హమాస్ మిలిటరీ చీఫ్‌ని లేపేసిన ఇజ్రాయిల్.. అక్టోబర్ 7 దాడులకు ప్రధాన సూత్రధారి..

మధుర లోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం పక్కన ఉన్న షాహీ ఈద్గా మసీదుపై దశాబ్ధాల నుంచి వివాదం నెలకొంది. ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 14 డిసెంబర్ 2023న, అలహాబాద్ హైకోర్టు శ్రీ కృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా మసీదు వివాదాస్పద స్థలంలో సర్వేను ఆమోదించింది. సుప్రీంకోర్టు అడ్వకేట్ కమిషనర్ ద్వారా సర్వే నిర్వహించాలని ఆదేశించింది. ఈ ప్రదేశంలో శ్రీకృష్ణుడి ఆలయం ఉందని, మొఘల్ కాలంలో దానిని కూల్చివేసి ఇక్కడ మసీదు నిర్మించారని హిందూ పక్షం పేర్కొంది. ఈ వివాదం 350 ఏళ్ల నుంచి కొనసాగుతోంది.