తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ గతేడాది లియో సినిమాతో బ్లాక్‍బాస్టర్ హిట్ అందుకున్నారు..స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన లియో మూవీ సూపర్ హిట్ అయింది. దీనితో దళపతి విజయ్ తన తరువాత మూవీగా ఓ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీని చేస్తున్నారు. ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అనే టైటిల్‍ను మేకర్స్ ఈ చిత్రానికి ఖరారు చేశారు. స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాకు టైటిల్ తోనే సూపర్ క్రేజ్ వచ్చింది. ఫస్ట్ లుక్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ మూవీలో విజయ్ డ్యుయల్ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రెండో షెడ్యూల్ సాగుతోంది. ఈ తరుణంలో ఈ చిత్రం ఓటీటీ హక్కుల ఒప్పందం జరిగినట్టు న్యూస్ బయటికి వచ్చింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టు సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
థియేటర్లలో రన్ పూర్తయ్యాకే ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ నెట్‍ఫ్లిక్స్‌లో వస్తుంది. భారీ ధరకు ఈ మూవీ ఓటీటీ హక్కులు అమ్ముడైనట్టు టాక్. లియో చిత్రం కూడా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.’ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ మూవీని జూన్ రెండో వారంలో థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.. జూన్ 22వ తేదీన దళపతి విజయ్ 50వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని జూన్ 13 లేదా జూన్ 20న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.అయితే, సైన్స్ ఫిక్షన్‍గా రూపొందుతున్న ఈ చిత్రం ఆ సమయంకల్లా పూర్తి అవుతుందో లేదో చూడాలి.’ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జోరుగా జరుగుతోంది. ఈ మూవీ షూటింగ్ స్పాట్‍కు అభిమానులు భారీగా తరళి వచ్చారు. వారందరికీ అభివాదం చేస్తూ విజయ్ వారితో ఓ సెల్ఫీ కూడా దిగారు. క్లీన్ షేవ్ తో విజయ్ నయా లుక్‍లో కనిపించి విజయ్ ఫ్యాన్స్ ఆశ్చర్యపరిచారు