Amarnath Yatra 2024 : అమర్నాథ్ పుణ్యక్షేత్రంలో తొలి పూజ పూర్తి..ఈనెల 29 యాత్ర ప్రారంభం
- అమర్నాథ్ గుహలో శనివారం మొదటి పూజ
- సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా
- యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు.. ప్రయాణం సాఫీగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందువుల ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటైన అమర్నాథ్ గుహలో శనివారం ‘మొదటి పూజ’ జరిగింది. శ్రీ అమర్నాథ్జీ పుణ్యక్షేత్రం బోర్డు (SASB) చైర్మన్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తన అధికారిక పోస్ట్‌లో పోస్ట్ చేశారు. బాబా అమర్నాథ్ జీ ఆశీర్వాదం తీసుకొని ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, పురోగతి, శ్రేయస్సు కోసం ప్రార్థించారు. కాశ్మీర్ హిమాలయాలలో సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న గుహ దేవాలయానికి పవిత్ర యాత్ర ఎల్లప్పుడూ మత సామరస్యానికి చిహ్నంగా ఉందని.. యాత్రికులు గుహ ఆలయానికి చేరుకోవడానికి స్థానిక ముస్లింలు సహాయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది జూన్ 29 నుంచి యాత్ర ప్రారంభం కానుంది. 52 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 19న రక్షాబంధన్, శ్రావణి పూర్ణిమతో ముగుస్తుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఇక్కడికి సందర్శిస్తుంటారు.
READ MORE: IND vs BAN: భారత్ – బంగ్లాదేశ్ మధ్య జరిగిన కీలక ఒప్పందాలు ఇవే…
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
మరో ప్రకటనలో.. “జమ్మూ కాశ్మీర్లో అన్ని వర్గాల ప్రజలు వారి మతంతో సంబంధం లేకుండా ఈ యాత్రలో పాల్గొనడం పురాతన సంప్రదాయం. దేశ విదేశాల నుంచి వచ్చే యాత్రికులను స్వాగతించడానికి, సేవ చేయడానికి పౌరులందరూ కలిసి రావాలని కోరుతున్నా. శ్రీ అమర్నాథ్ జీ పుణ్యక్షేత్రం బోర్డు, సంబంధిత శాఖల అధికారులు యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు సేవలను అందించడానికి కట్టుబడి ఉన్నారు. ప్రయాణం సాఫీగా, సురక్షితంగా మరియు అవాంతరాలు లేకుండా ఉండేలా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము. భక్తులకు కావాల్సిన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, భద్రతను గణనీయంగా పెంచాం.” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!